ETV Bharat / state

బైక్​పై ఎన్టీఆర్​ స్టిక్కర్ వివాదం- యువకుడు అనుమానాస్పద మృతి - NTR Sticker Fight Man Suspicious Death - NTR STICKER FIGHT MAN SUSPICIOUS DEATH

NTR Sticker Fight Man Suspicious Death : ద్విచక్రవాహనంపై ఎన్టీఆర్‌ స్టిక్కర్‌.. వైఎస్సార్సీపీ కార్యకర్త గొడవ.. కొద్ది గంటల్లోనే యువకుడి మృతి. అసలేెం జరిగింది! అన్యాయంగా పంతొమ్మిదేళ్లకే నా కొడుకును చంపేశారే అని ఆ తల్లి రోదిస్తుంటే స్థానికులు చలించిపోయారు.

ntr_sticker_fight_man_suspicious_death
ntr_sticker_fight_man_suspicious_death (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 1:33 PM IST

NTR Sticker Fight Man Suspicious Death in NTR District : ద్విచక్రవాహనంపై ఎన్టీఆర్‌ స్టిక్కర్‌ తొలగించే విషయమై ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తూర్పు బజారు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మందా కార్తీక్‌ (19), వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కారె నాగరాజు మధ్య గొడవ చోటు చేసుకోవడం, కొద్ది గంటల్లోనే కార్తీక్‌ మృతదేహమై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

కార్తీక్​ కుటుంబ సభ్యులు, ఎస్సై అభిమన్యు తెలిపిన వివరాల ప్రకారం నాగరాజు వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయనకు టాటా ఏస్‌ వాహనం ఉంది. ఈ వాహనానికి టీడీపీ సానుభూతిపరుడైన కార్తీక్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పెనుగంచిప్రోలులో నిర్వహించిన టీడీపీ సంబరాల్లో కార్తీక్‌ పాల్గొన్నారు. సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వేమవరం వెళ్లారు. నాగరాజును కలిశారు. ఆ సమయంలో కార్తీక్‌ తన ద్విచక్రవాహనం వెనుక అంటించుకున్న ఎన్టీఆర్‌ స్టిక్కర్‌ను ఆయనతోనే బలవంతంగా తొలగింపజేస్తూ నాగరాజు వీడియో తీశారు.

వైఎస్సార్సీపీ శ్రేణులదాడిలో టీడీపీ కార్యకర్త మృతి- మరో ఇద్దరి పరిస్థితి విషమం - TDP and YSRCP workers clash

YSRCP Followers Anarchies : కార్తీక్‌ వారించినా వినలేదు. ఆ వీడియోను నాగరాజు తన వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు. స్టిక్కర్‌ తీసేయించిన 2, 3 గంటల్లోనే వేమవరం సమీపంలో రోడ్డు పక్కన కార్తీక్‌ తీవ్రగాయాలతో శవమై కనిపించారు. మృతదేహంపై బలమైన గాయాలున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. గాయాలు కింద పడితే తగిలినట్లు లేవని, బలంగా కొట్టి హతమార్చారని మృతుడి తండ్రి మందా బెనర్జీ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వత్సవాయి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నాగరాజుతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తల అరాచకాలకు వందలాది మంది ప్రజలు బలయ్యారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు హింసాత్మక పనులు మానుకోలేదనడానికి నిదర్శనమే 19 ఏళ్ల యువకుడి మృతి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై అధికాలు తగిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరారు.

నేతలకు బెయిలు, కార్యకర్తలకు జైలు- రాజకీయ సంగ్రామంలో సామాన్యులే సమిధలు - no bail

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.