ETV Bharat / state

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ - తెలంగాణలో 15 శాతం నాన్‌లోకల్‌ కోటా యథాతథం - Non local quota in Telangana 2024 - NON LOCAL QUOTA IN TELANGANA 2024

Continue Non Local Quota in Telangana 2024-25 : ఏపీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర విద్యాసంస్థల్లోని కన్వీనర్‌ కోటా సీట్లలో ఈసారికి ఏపీ విద్యార్థులూ చేరొచ్చని తెలిపింది. 2024-25 విద్యాసంవత్సరానికి పాత విధానమే వర్తింస్తుందని స్పష్టం చేసింది.

Non local quota in Telangana 2024
Non local quota in Telangana 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 12:48 PM IST

Implementation Non Local Quota in Academic Year 2024-25 : తెలంగాణలో నూతన విద్యాసంవత్సరం(2024-25)లో ఇంజినీరింగ్‌ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా కన్వీనర్‌ కోటాలోని 15 శాతం నాన్‌లోకల్‌ సీట్లకు పోటీ పడి దక్కించుకోవచ్చు. ఈ విషయంపై ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టతను ఇచ్చారు. జూన్‌ 2లోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ వెలువరించినందువల్ల ఏపీ విద్యార్థులు కూడా రాష్ట్రంలో ప్రవేశాలు పొందవచ్చని ఆయన తెలిపారు.

ఏమిటీ 15 శాతం? : ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సీట్లు పొందేందుకు వీలు కల్పించారు. ఇందులో భాగంగా కన్వీనర్‌ కోటాలోని 15 శాతం స్థానికేతర(నాన్‌లోకల్‌) సీట్లకు వారు కూడా ప్రవేశాలకు పోటీపడేలా, అప్పటివరకు ఉన్న విధానాన్ని పదిసంవత్సరాల పాటు పొడిగించారు. 2014 జూన్‌ 2న అమలులోకి వచ్చిన ఈ విధానం, 2024 జూన్‌ 2 వరకు అమల్లో ఉంటుంది.

15 Percent Non Local Quota in TS : 2014 నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నాన్‌లోకల్‌ కోటా కింద ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. ఇందులో భాగంగా ఎప్‌సెట్‌తోపాటు వివిధ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద ఉన్న సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. అందులో మెరిట్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు సీట్లు దక్కుతాయి.

పది, ఇంటర్​ అర్హతతో - నౌకాదళంలో అగ్నివీర్​ పోస్టులు - మహిళలూ అర్హులే! - Navy Agniveer Recruitment 2024

ఏపీ విద్యార్థులు పోటీపడవచ్చా? లేదా? : దీని ప్రకారం ప్రతిఏటా సుమారు 4,000ల మంది ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కన్వీనర్‌ కోటా కింద తెలంగాణలోని విద్యాసంస్థల్లో బీటెక్‌లో అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ మినహాయింపు అమలుకు వచ్చే నెల జూన్‌ 2 నాటికి పదేళ్లు పూర్తవుతుంది. మరోవైపు అలాంటప్పుడు 2024-25 విద్యాసంవత్సరానికి 15 శాతం నాన్‌లోకల్‌ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీపడవచ్చా? లేదా? అనే ప్రశ్న తలెత్తింది.

దీనిపై తెలంగాణ సర్కార్ విధానాన్ని తెలియజేయాలంటూ ఉన్నత విద్యామండలి గత డిసెంబరులోనే లేఖ రాయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనవరిలో జరిగిన భేటీ సందర్భంగా చర్చ జరిగింది. ఈసారికి పాత విధానంలోనే ప్రవేశాలు జరపాలని అప్పట్లోనే సీఎం స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాతే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎప్‌సెట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈసారి ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌కు 49,063 మంది ఆంధ్రప్రదేశ్‌ స్థానికత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయగా, 44,889 మంది పరీక్ష రాశారు. వీరిలో 34,621 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌కు 12,352 మంది అర్జీ చేసుకున్నారు. వారిలో 10,254 మంది పరీక్షకు హాజరు కాగా, 9,597 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరంతా కన్వీనర్‌ కోటాలో 15 శాతం నాన్‌లోకల్‌ కోటా సీట్లకు పోటీ పడేందుకు అర్హత సాధించారు.

ప్రవేశ పరీక్షల నోటిఫికేషనే ప్రాతిపదిక : ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రధానంగా బీటెక్‌ సీట్లకే పోటీపడుతుంటారు. ఆయా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఫిబ్రవరి, మార్చిలో జారీ అయ్యాయి. అయితే ప్రవేశాల నోటిఫికేషన్‌(కౌన్సెలింగ్‌ షెడ్యూల్) జూన్‌ 2 తర్వాత జారీ చేస్తే ఏపీ పునర్విభజన చట్టం వర్తించదని, కన్వీనర్‌ కోటాలోని 100 శాతం సీట్లూ తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకే దక్కుతాయని కొద్ది నెలల క్రితం వరకు భావిస్తూ వచ్చారు.

మరోవైపు పరీక్ష రాసిన వారికి ప్రవేశాలు ఇవ్వకపోవడం న్యాయం కాదని, ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ జూన్‌ 2 లోపు వచ్చిందా? లేదా? అన్నది మాత్రమే చూడాలని విద్యాశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. పరీక్ష రాసిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే విద్యార్థులు న్యాయస్థానానికి వెళ్లే అవకాశముందని, దీంతో సమస్యలు వస్తాయని అధికారులు భావించారు. ఇప్పటికే ఎప్‌సెట్‌ కన్వీనర్‌ కోటాలో 20 శాతం సీట్లు మిగిలిపోతున్నాయని భావించిన తెలంగాణ సర్కార్ ఈసారికి యథావిధిగా స్థానికేతర కోటా వర్తింపజేస్తామని స్పష్టంచేసింది.

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్‌ ర్యాంకుల్లో బాలుర సత్తా - TS EAPCET Results 2024

జీతం లక్షల్లో, జీవితం లగ్జరీగా!​ - మీరు కూడా అవుతారా పైలట్​? - How to Become a Pilot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.