ETV Bharat / state

నిర్లక్ష్యానికి గురవుతున్న జూరాల - కనీస వసతులు లేక పర్యాటకుల ఇక్కట్లు - Jurala Project Tourism - JURALA PROJECT TOURISM

Jurala Project Tourism : పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్నిరకాల అవకాశాలున్న సాగునీటి ప్రాజెక్టు జూరాల. ఏటా వేలాది మంది పర్యాటకులు జూరాలను సందర్శించేందుకు వచ్చి వెళ్తుంటారు. కానీ దశాబ్దాలుగా ఆ ప్రాజెక్టు వద్ద పర్యాటక అభివృద్ధి నిర్లక్ష్యానికి గురవుతోంది. కృష్ణమ్మ జలపరవళ్లను తిలకిచేందుకు వచ్చే పర్యాటకులు కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. సందర్శకుల సౌకర్యార్ధం గత ప్రభుత్వం చేపట్టిన పర్యాటక అభివృద్ధి పనులు 80శాతం పూర్తై ప్రారంభానికి నోచుకోలేదు.

Lack of Facilities in Jurala Project
Lack of Facilities in Jurala Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 9:22 AM IST

Updated : Jul 26, 2024, 9:44 AM IST

No Facilities in Jurala Project : కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణానది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే మొదటి నీటి పారుదల ప్రాజెక్టు జూరాల. జూలైలో మొదలుకుని సెప్టెంబర్ వరకూ జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. జూరాల నిండినప్పుడు, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు అక్కడకు సందర్శకులు పోటెత్తుతారు.

పర్యాటకులకు తప్పని ఇక్కట్లు : కృష్ణమ్మ జలపరవళ్లను తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా సహా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది జూరాలకు వచ్చి వెళ్తుంటారు. అక్కడి ప్రకృతి అందాలను చూస్తూ సేద తీరుతారు. కానీ అక్కడ కనీస వసతులు కూడా ఉండవు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్​, తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి, సేద తీరేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. ప్రాజెక్టు చుట్టుపక్కల చెట్ల కిందో, పుట్ట కిందో కూర్చుని, అక్కడి మత్సకారులు వండి పెట్టే ఆహారాన్ని కొనుగోలు చేసి తిని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఆహ్లాదం కోసం ఉద్యానవనాలు, పిల్లలు ఆడునేందుకు ఆట స్థలాలు ఇలాంటివి ఏవీ అక్కడ కనిపించవు. దీంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు.

గతంలో పార్కు నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు : జూరాల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ హామీ మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి పార్కు నిర్మాణం కోసం 2020 అక్టోబర్‌లో రూ,15కోట్లు మంజూరు చేశారు. పర్యాటక శాఖ అధ్వర్యంలో పార్కు పనులు ప్రారంభమై 80శాతం వరకూ పూర్తయ్యాయి. ప్రధాన ద్వారం, వంతెన, దుకాణ సముదాయాలు, ఫుడ్‌కోర్ట్‌, ఆంఫీ థియేటర్, ఫౌంటెన్, పిల్లలకు ఆటస్థలం, శిల్పాలతో కూడిన ఉద్యానవనం, నవగ్రహవనం, మేజ్ గార్డెన్‌కు సంబంధించి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం- అందాలు చూడతరమా! - Bogatha Waterfalls Mulugu

చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. జూరాలకు కృష్ణా ప్రవాహం మొదలైన నేపథ్యంలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఈ గార్డెన్ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పార్కు వల్ల సందర్శకులకు వసతులతో పాటు స్థానికంగా ఉండే మత్స్యకారులు, యువతకు ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"కాసేపు కుటుంబంతో సమయం గడుపుదామని ప్రాజెక్టు దగ్గరకు వస్తాం. కనీస సౌకర్యాలు లేవు. కూర్చోడానికి స్థలం లేదు. తినడానికి ఇక్కడ ఏమీ దొరకవు. తాగటానికి నీరు కూడా లేవు. చూడటానికి ఎంత సంతోషంగా ఉన్నా, సౌకర్యాలు లేక రాకూడదు అనిపిస్తుంది. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుంది." - స్థానికులు

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేసిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సైతం పార్కు పనుల పురోగతిని పరిశీలించారు. పనులు 80శాతం వరకూ పూర్తయ్యాయని చెప్పిన ఆయన పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ.25 కోట్లు కావాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృషికి తీసుకువెళ్లినట్లు ఆయన వివరించారు. రానున్న 4 నెలల వరకూ జూరాలకు సందర్శకుల తాకిడి కొనసాగనున్న నేపథ్యంలో తాత్కాలికంగానైనా కనీస వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నీటిపై తేలుతూ హ్యాపీగా తినేయొచ్చు - ఈ రెస్టారెంట్ గురించి మీకు తెలుసా? - FLOATING RESTAURANT ON KRISHNA

"తెలంగాణను మెడికల్ టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం" - CM Revanth on Warangal Development

Last Updated : Jul 26, 2024, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.