ETV Bharat / state

ఎన్ఎంఎస్ పరీక్షలో ప్రతిభ చూపండి - రూ.12 వేల ఉపకారవేతనం సొంతం చేసుకోండి

నవంబర్ 24న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష - పరీక్షలో ప్రతిభ చూపితే ఏడాదికి రూ.12 వేల ఉపకారవేతనం -

NMMS Scholarship Exam Update
NMMS Scholarship Exam Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

NMMS Scholarship Exam Update : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సువర్ణవకాశం. ఈ పది రోజులు కష్టపడితే ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు స్కాలర్​షిప్ అందుకునే అవకాశం ఉంటుంది. 4 ఏళ్లు స్టేషనరీ, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది. కేంద ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 24న ఎన్​ఎంఎస్(నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌) పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్స్​కు పది రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. గత ప్రశ్నపత్రాలు(ప్రీవియస్ పేపర్లు సాధన చేయించాలని సూచించారు.

ఉన్నత విద్యకు తోడ్పాటు : గవర్నమెంట్ పాఠశాలల్లో 8 వ తరగతి చదివే విద్యార్థుల కోసం ప్రతి ఏటా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు, వసతి లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు మాత్రమే రాసేందుకు అర్హులు. ఈ స్కాలర్​షిప్​నకు రాత పరీక్ష విధానంలో ఎంపిక చేస్తారు. ఇప్పటికే 2 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ నెల 24న పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా స్టూడెంట్స్​ను ఎంపిక చేస్తారు.

ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం : ఎన్‌ఎంఎంఎస్‌(నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌) కింద ఎంపికైన స్టూడెంట్​కు ఏడాదికి రూ.12 వేల స్కాలర్​షిప్ చెల్లిస్తారు. ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే వరకు రూ.48 వేలు నేరుగా విద్యార్థి బ్యాంకు అకౌంట్లో జమవుతాయి. 2017 వరకు ఏడాదికి 6 వేల రూపాయలు మాత్రమే చెల్లించేవారు. 2018 నుంచి ఈ స్కాలర్​ షిప్​ను రూ.12 వేలకు పెంచారు.

180 మార్కులకు పరీక్ష : ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్​షిప్ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో మెంటల్‌ ఎబిలిటీకీ 90 మార్కులు కేటాయించారు. రీజనింగ్‌ తదితర ప్రశ్నలను విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి రాస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను పొందవచ్చు.

రెండో పరీక్షను ఆప్టిట్యూడ్‌ పేరుతో నిర్వహిస్తారు. మ్యాథ్స్, సామాన్య, సాంఘిక శాస్త్రాల నుంచి 90 మార్కులు ఉంటాయి. 7వ తరగతి సిలబస్‌తో పాటు 8వ తరగతి సగం సిలబస్‌ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి.

విద్యార్థులను సిద్ధం చేయాలి : 'ఎన్‌ఎంఎంఎస్‌ ఎగ్జామ్​కు విద్యార్థులను సిద్ధం చేయాలి. పరీక్ష ఏవిధంగా రాయాలో టీచర్లు విద్యార్థులకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది జిల్లా నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది ఎంపికయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి' అని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లాలోని అన్ని పాఠశాలలను ఆదేశించారు.

6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - SBI ఫ్రీ స్కాలర్​షిప్​! - ఇలా దరఖాస్తు చేసుకోండి - SBIF Asha Scholarship Program 2024

కార్తిక పౌర్ణమి స్పెషల్‌ : శివుణ్ని దర్శించుకున్న ఎలుగుబంట్లు! - హడలిపోయిన భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.