Newly Wed Bride Suicide in Kothagudem : సాధారణ అమ్మాయిలా కాకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలి అనుకుంది. వయస్సు రాగానే ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి ఇప్పుడు పెళ్లి వద్దని చదువువైపే తన అడుగులు అంది. కానీ ఇంట్లోవారు తమకు ఆరోగ్యం బాగుండటం లేదని బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. తల్లిదండ్రుల మాటలు కాదనలేక తల వంచి తాళి కట్టించుకుంది. కానీ ఆమె ఆశయాలు ఆమెను వీడలేదు. చదువుపై మక్కువ తీరక, భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకోలేక పోయింది.
ప్రేమ పేరుతో మోసం.. మైనర్‌ను గర్భవతిని చేసిన యువకుడు
చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారో అర్థం చేసుకున్న ఆ అమ్మాయి, ఆ కష్టమంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైందని బాధ పడింది. తన కోసం, తల్లిదండ్రుల కోసం ఏం చేయలేకపోతున్నానని మనస్తాపం చెందింది. కనీసం తల్లిదండ్రులు కూడా తన ఆశలను అర్థం చేసుకోలేకపోయారని చింతించింది. భవిష్యత్ గురించి కలలు కనే హక్కు లేని తనకు బతకే అర్హత లేదని భావించిందో ఏమో, పదహారు రోజుల పండుగకు పుట్టింటికి వచ్చిన ఆ నవ వధువు తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రాణం విడిచింది. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్య బంజర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఎస్‌ఐ మాచినేని రవి కథనం ప్రకారం : మంగయ్య బంజర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి(23) ఇటీవలె బీఎస్సీ పూర్తి చేసింది. అనంతరం ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. తల్లి తనకు ఆరోగ్యం బాగుండటం లేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. తల్లిదండ్రుల మాట, నా ఆశయామా రెండింట్లో కన్నవాళ్ల వైపే మొగ్గు చూపింది. చేసేదేం లేక పెళ్లికి ఒప్పుకుంది. దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గత నెల 28న ఆమెకు వివాహం జరిగింది. ఈక్రమంలో ఇటీవల దేవకి పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చింది.
చదువుపై మక్కువతో బలవన్మరణం : ఈ నెల 14వ తేదీన రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కొత్తగూడెం ఆసుపత్రికి, అనంతరం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమెకు ఇంజినీరింగ్ చదివిన సోదరుడు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.