ETV Bharat / state

డీఎస్సీ అప్​డేట్ - కొనసాగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియ

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి పోస్టింగులు - కొత్త టీచర్లకు కొనసాగుతున్న కౌన్సెలింగ్‌ - ఉదయం ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించిన నిపుణులు

New Teacher Postings Today in Telangana
New Teacher Postings Today in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 12:47 PM IST

Updated : Oct 15, 2024, 6:02 PM IST

New Teacher Postings Today in Telangana : డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న10,006 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు ఇస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఉదయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించారు. సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతినిచ్చింది. దీంతో మధ్యాహ్నం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే కౌన్సెలింగ్‌కి వచ్చి వెనుదిరిగిన వారికి డీఈవోలు సమాచారం అందించారు.

ఒక్కసారిగా అవాక్కైన అభ్యర్థులు : షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయమే కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగాలి. అయితే సాంకేతిక సమస్య ఏర్పడటంతో కౌన్సెలింగ్ వాయిదా వేశామని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కరోజు ముందు కౌన్సెలింగ్‌ ఉందని సమాచారం ఇచ్చి ఉదయమే వాయిదా వేయడంతో అవాక్కయ్యారు. కౌన్సెలింగ్‌ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నఫలంగా వాయిదా వేయడం అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను స్కూల్‌ అసిస్టెంట్‌గా సెలెక్ట్‌ అయ్యాను. ఇవాళ కౌన్సెలింగ్‌ ఉందని నిన్న సాయంత్రం చెప్పారు. కౌన్సెలింగ్‌కు అటెండ్‌ అవుదామని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కౌన్సెలింగ్‌ లేదు వాయిదా పడిందని అడగ్గా వివిధ జిల్లాల్లో సెలెక్షన్‌ లిస్ట్‌ రాకపోవడం వల్ల , అందుబాటులోకి లేదు కావున ఇక్కడికి వచ్చాక తెలిపారు. అక్కడి నుంచి ఇక్కడి వచ్చి మా సమయం వృథా అయ్యింది. ఆ విషయం కాస్త ముందుగా చెప్తే బాగుండేది." - డీఎస్సీ ఉద్యోగస్థుడు

ఈ ఏడాది ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను సుమారు 2లక్షల 46వేల మంది పరీక్షలు రాశారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి 5 వరకు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. అందులో ఎంపికైన వారికి ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

ఆ ఊరి నుంచి 8 మంది ఒకేసారి డీఎస్సీకి ఎంపికయ్యారు

బాల్యం ఇటుక బట్టీలో - భవిష్యత్తు అంతా బంగారు 'బడి'లో

Last Updated : Oct 15, 2024, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.