ETV Bharat / state

ఆసిఫాబాద్​లో తారుమారైన 'నీట్'​ క్వశ్చన్ పేపర్ - ఆందోళనలో విద్యార్థులు - NEET Paper Changed in Asifabad

author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 10:52 AM IST

Updated : May 6, 2024, 7:00 PM IST

NEET Exam Paper Mix Up in Telangana : దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్​ పరీక్షలో ఓ తప్పిదం జరిగింది. కుమురం భీం ఆసిపాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్​కు బదులు మరో క్వశ్చన్ పేపర్​ సెట్​ను నిర్వాహకులు ఇచ్చారు. సోమవారం కీ పేపర్​ను చెక్​ చేసుకోగా వారికి వచ్చిన పేపర్​ ఎన్టీఏ ఇచ్చిన పేపర్ వేర్వెరని గుర్తించి స్

NEET Exam Paper Change center
NEET Exam Paper Change in Telangana (ETV Bharat)

NEET Question Paper Changed in Asifabad : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్​టీఏ నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్​టీఏ అందించిన పేపర్ కాకుండా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నపత్రం అందించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్​టీఏ నీట్​ పరీక్ష నిర్వహించారు. ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని మోడల్​ స్కూల్లో నీట్​ పరీక్ష పెట్టారు. పరీక్షా కేంద్రంలో 323 మందికి గానూ 299మంది రాశారు. అయితే వారికి రావాల్సిన పేపరుకు బదులుగా ఎన్​​టీఏ తయారు చేసిన వేరే కోడ్​ ఉన్న మరొక ప్రశ్నాపత్రాన్ని నిర్వాహకులు అందించారు. సోమవారం కీ పేపర్​ పరిశీలించిన విద్యార్థులు తమకు ఇచ్చిన ప్రశ్నపత్రానికి ఎన్​టీఏ విడుదల చేసిన కీ పేపర్​లో లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయమై జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు ఈ విషయంపై ఆర్డీవో లోకేశ్వరరావు పరీక్ష కేంద్రానికి వెళ్లి విచారణ చేశారు. దీనిపై పరీక్ష నిర్వాహకులను వివరణ కోరగా ఎస్​బీఐ బ్యాంకు నుంచి తీసుకురావలసిన పేపర్​కు బదులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్​ను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. అయితే ఎన్​టీఏ ఈమెయిల్ ఆధారంగానే పరీక్ష పత్రం తీసుకువచ్చినట్లు వివరించారు.

"మా అబ్బాయి రెండు సంవత్సరాల నుంచి నీట్​ పరీక్ష కోసం కష్టపడి చదువుతున్నాడు. గాంధీలో సీటు కొట్టాలని అనుకున్నాడు. వేరే పేపర్​ ఇవ్వడం వల్ల అందులో అవుట్​ ఆఫ్​ సిలబస్​ వచ్చిందంటా. ఇప్పడు వీళ్లకు హార్డ్​గా ఉండి, వేరే పిల్లలకు ఈజీగా ఉంటే ఎలా? మాకు ఏదో ఒక సొల్యూషన్​ చూపించాలి." - విద్యార్థుని తల్లి

"మేము నిన్న నీట్​ పరీక్ష రాశాము. అయితే దేశమంతా ఒక పేపర్​ రాస్తే మేము వేరే పేపర్​ రాశాము. సిలబస్​ చూస్తే మాకు కొంచెం టఫ్​గా వచ్చింది అనిపిస్తుంది. వారందరికి ఒకలా మార్కులు వస్తే మాకు మరోలా మార్కులు వస్తాయి. దీన్ని అందరూ పరిగణించి యాక్షన్​ తీసుకోవాలి." - విద్యార్థులు

వారి ప్రశ్నపత్రాన్ని పరిగణలోకి తీసుకోనున్న ఎన్​టీఏ : అనంతరం ఆర్డీవో అధికారి మాట్లాడుతూ విద్యార్థులు రాసిన ప్రశ్నపత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఎన్​టీఏ అధికారులు వివరించినట్లు తెలిపారు. కాగా ప్రశ్నపత్రం తారుమారుపై అధికారిక వెబ్​సైట్​లో ఉంచాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

NTA On NEET Question Paper Leak : మరోవైపు నీట్​ పరీక్షా పత్రాలు లీక్​ అయ్యాయంటూ వస్తున్న వార్తలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఖండించింది. ఆదివారం దేశ వ్యాప్తంగా 4750 కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్​ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. నీట్ సెక్యూరిటీ ప్రొటోకాల్స్​ ప్రకారమే నిర్వహించినట్లు స్పష్టం చేసింది. పేపర్​ లీకేజీ జరిగినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ఎన్​టీఏ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. సోషల్​ మీడియాలో సర్క్యూలేట్​ అవుతున్న ప్రశ్నపత్రాలకు, ఆదివారం జరిగిన నీట్​ పరీక్షా పత్రాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ ఏడాది అత్యధికంగా రికార్డు స్థాయిలో 24లక్షల మంది నీట్​కి రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్టు నీట్​ వివరించింది.

ఆసిఫాబాద్​లో తారుమారైన నీట్ క్వశ్చన్ పేపర్ ఆందోళనలో విద్యార్థులు (ETV Bharat)

NEET PG Medical Counselling 2023 : 'సున్నా' మార్కులొచ్చినా నీట్‌ పీజీ సీటు.. ఎంసీసీ కీలక నిర్ణయం

NEET PG ప్రవేశ పరీక్ష తేదీ మార్పు- ఎగ్జామ్​ ఎప్పుడంటే?

Last Updated : May 6, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.