Nearly 200 Trains Cancelled Due to Cyclone Dana Effect : దానా తుపాను ఎఫెక్ట్‌తో తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లు ఈనెల 23, 24, 25 తేదీల్లో రద్దు చేశారు. అంతేకాకుండా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించాల్సి ఉన్న మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు రద్దు చేసినవి, దారి మళ్లించినవి కలిపి సుమారు 200 సర్వీసులున్నాయని అధికారులు తెలిపారు. రద్దు అయిన రైల్వే సర్వీసులు వివరాలు ప్రయాణికులకు తెలియజేయడానికి హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో హెల్ప్లైన్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.
గంటకు 18 కి.మీ వేగంతో : గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ‘దానా’ తుపాను ముందుకు కదులుతుందని వాాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్రంగా రూపాంతరం చెందుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధవారం ఉదయానికి పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 630 కి.మీ, ఒడిశాలోని పరదీప్‌కు 560 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపురకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశాలోని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించింది.
ఏపీలోని ఉత్తరాంధ్రలో ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈరోజు నుంచి ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి గంటకు 80-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో సముద్రం అలజడి ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇది గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటుతుందంటున్న వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం - ఆ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!
ట్రైన్ ప్రయాణికులకు ముఖ్య గమనిక - ఆ వైపు వెళ్లే 41 రైళ్లు రద్దు