ETV Bharat / state

ముగిసిన ఎన్డీఎస్​ఏ నిపుణుల కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన - ఇంజినీర్లపై కమిటీ ఛైర్మన్ ఫైర్ - NDSA committee meeting at Jalasauda

NDSA Committee Meeting at Jalasauda : ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ఇవాళ జలసౌధలో సమావేశం నిర్వహించిది. ఇంజినీర్ల సమావేశంలో చంద్రశేఖర్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అడిగిన వివరాలు పూర్తిగా చెప్పకపోవండతో పాటు ఒకరిపై ఒకరు సాకులు వేసుకునే ప్రయత్నం చేయడాన్ని ఆయన తప్పుపట్టినట్లు తెలిసింది.

NDSA Inspection on Kaleshwaram Project
NDSA Committee Meeting at Jalasauda
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 4:42 PM IST

Updated : Mar 9, 2024, 9:39 PM IST

NDSA Committee Meeting at Jalasauda : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఏర్పాటైన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ(NDSA) రాష్ట్ర పర్యటన ముగిసింది. చివరి రోజైన ఇవాళ హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదలశాఖ అధికారులు, ఇంజనీర్లతో కమిటీ సుధీర్ఘంగా సమావేశమైంది. ముూడు ఆనకట్టల ఇన్వెస్టిగేషన్స్, ప్లానింగ్, మోడల్ స్టడీస్, డిజైన్స్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది.

NDSA Inspection on Kaleshwaram Project : 2016లో ఆనకట్టల నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆయా బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లతో, కమిటీ ఇవాళ సమావేశమైంది. ఆయా విభాగాల వారీగా ఇంజనీర్లతో విడివిడిగా సమావేశమైన ఎన్డీఎస్ఏ కమిటీ సంబంధిత వివరాలు, సమాచారాన్ని తీసుకొంది. ఇంజనీర్లతో పాటు ఏజెన్సీల ప్రతినిధులతోనూ కమిటీ చర్చించి అవసరమైన సమాచార సేకరణ చేసింది. డ్రాయింగ్స్ ను, మోడల్స్ ను పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకొంది.

ఇంజినీర్ల సమావేశంలో చంద్రశేఖర్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అడిగిన వివరాలు పూర్తిగా చెప్పకపోవండతో పాటు ఒకరిపై ఒకరు సాకులు వేసుకునే ప్రయత్నం చేయడాన్ని ఆయన తప్పుపట్టినట్లు తెలిసింది. వివరాలు చెప్పడంలో కొంత మంది ఇంజనీర్లలో స్పష్టత లేకపోవడంపై అయ్యర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆనకట్టల డిజైన్స్ ఖరారు చేసిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (CDO) ఇంజనీర్లతో సమావేశం పూర్తిగా జరగలేదు. దీంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లతోనూ సమావేశం జరగలేదు.

గతంలో ఆయా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఇంజనీర్లతోనూ భేటీ కాలేదు. దీంతో మరోమారు ఇంజనీర్లతో కమిటీ సమావేశం కానుంది. ఈ నెల ఆరో తేదీన రాష్ట్రానికి వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ, అదే రోజు నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam), అధికారులు, ఇంజినీర్లతో సమావేశమైంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించింది.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన ఎన్​డీఎస్ఏ బృందం - సీపేజీ నాణ్యతా లోపాలపై ఆరా!

మూడు ఆనకట్టలకు సంబంధించిన 19 అంశాల సమాచారాన్ని కమిటీ అధికారులను అడిగింది. కమిటీ అడిగిన సమాచారం ఇచ్చినట్లు చెప్తున్న నీటిపారుదలశాఖ అధికారులు, ఇంకా ఏదైనా సమాచారం, వివరాలు అడిగితే కూడా ఇస్తామని అంటున్నారు. మేడిగడ్డ ఆనకట్ట పియర్స్​లో పగుళ్లకు మిగిలిన రెండు ఆనకట్టల్లో వచ్చిన సమస్యలకు గల కారణాలపైనే కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. అందుకు సంబంధించిన ఇంజినీర్లు, ఏజెన్సీల నుంచి సమాచారం, వివరణ అడుగుతున్నారు. దిల్లీ వెళ్లిన తర్వాత కమిటీ అన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేసి రాష్ట్ర అధికారులకు తదుపరి సమాచారం ఇవ్వనుంది.

ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఆధారంగానే మరమ్మతులతో పాటు చర్యలు : ఉత్తమ్‌

మేడిగడ్డ విషయంలో బీఆర్​ఎస్​ తీరు హాస్యాస్పదం : మంత్రి ఉత్తమ్​

Last Updated : Mar 9, 2024, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.