ETV Bharat / state

నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ అధ్యయనం

NDSA Committee Visits Kaleshwaram Today : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురి నిపుణుల కమిటీ ఇవాళ్టి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది. రెండ్రోజుల పాటు డ్యాంలను సందర్శించి డిజెన్లు, నిర్మాణాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కమిటీకి అవసరమైన సహకారం అందించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

NDSA Committee Visit Kaleswaram
NDSA Committee Visit Kaleswaram
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 7:25 AM IST

బ్యారేజీల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో కమిటీ అధ్యయనం

NDSA Committee Visits Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్ట కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ అన్నారం, మేడిగడ్డ (Medigadda Barrage), సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల పరిశీలన, నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ- ఎన్‌డీఎస్ఏ ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర వాటర్‌ కమిషన్‌కు చెందిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా, యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్‌, శివకుమార్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ సింగ్‌, అమితాబ్‌ మీనాలు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది.

కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ బృందం

హైదరాబాద్‌ జలసౌధలో ఈ నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో (Irrigation Minister Uttam Kumar Reddy) సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని కోరారు. మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని నిపుణుల బృందం చెప్పినట్లు వెల్లడించారు. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కోరినట్లు వివరించారు. తెలంగాణ సర్కార్ కోరిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపడంపై ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

"చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తుంది. వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని కోరాం. కమిటీకి మా తరపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. సమస్యకు కారణం ఎవరనేది కూడా నివేదికలో పొందుపరచాలని కోరాం. ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ వేసి, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు పంపింది." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి , నీటిపారుదల శాఖ మంత్రి

Medigadda Barrage Damage Updates : ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఈరోజు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనుంది. కాసేపట్లో మేడిగడ్డకు బయలుదేరనున్న కమిటీ మధ్యాహ్నం 1:30 గంటల వరకూ బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగుళ్లు కారణంగా ఆనకట్ట సామర్థ్యం గేట్ల పరిస్ధితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది.

మేడిగడ్డ ఘటనపై విజిలెన్స్ దర్యాప్తు - 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు!

Annaram Saraswati Barrage Leakage : మధ్యాహ్నం భోజనానంతరం అధికారుల బృందం, అన్నారం (Annaram Saraswati Barrage Leakage) బయలుదేరనుంది. ఆనకట్టలో సీపేజీకి దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించనుంది. వర్షాకాలంలో గోదావరికి వరద ప్రారంభమైయ్యే పరిస్ధితులనూ పరిగణనలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిపుణుల కమిటీ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. శుక్రవారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనున్న నిపుణుల కమిటీ, రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ నెల 9న హైదరాబాద్‌లో సాగునీటి శాఖ అధికారులతో భేటీ అనంతరం అధికారుల బృందం దిల్లీకి వెళ్లనున్నారు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం - మేడిగడ్డలో గేట్లు ఎత్తే సాధ్యసాధ్యాలపై విశ్లేషణ

మేడిగడ్డ బ్యారేజీపై అధికారుల విశ్లేషణ - దశల వారీగా మిగతా బ్లాకులు, ఆనకట్టలపై ఇన్వెస్టిగేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.