ETV Bharat / state

ముగిసిన ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటన - బ్యారేజీల కీలక వివరాలు సేకరించిన బృందం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 3:42 PM IST

Updated : Mar 8, 2024, 9:51 PM IST

NDSA Committee Visits Annaram Barrage : ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇవాళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించారు. బ్యారేజీకి సీపేజీలు, బుంగలు ఏర్పడిన ప్రాంతాలను పరిశీలించారు. దెబ్బతిన్న ప్రాంతాలపై విస్తృత అధ్యయనం చేశారు. ఇంజినీర్ల నుంచి బ్యారేజీలకు సంబంధించిన పలు వివరాలను సేకరించారు.

NDSA Committee Members
NDSA Committee Visit Annaram Barrage

అన్నారం బ్యారేజీ సందర్శించిన ఎన్డీఎస్ఏ కమిటీ సీపేజీలపై విస్తృత అధ్యయనం

NDSA Committee Visits Annaram Barrage : జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ నిపుణుల కమిటీ(NDSA Committee) చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన రెండోరోజు కొనసాగింది. నిపుణుల బృందం ఇవాళ అన్నారం బ్యారేజీని సందర్శించింది. తొలుత కమిటీ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి బ్యారేజీ పైభాగంలో పరిశీలించారు. బ్యారేజీకి వచ్చే నీటి ప్రవాహం, నీటి నిల్వ సామర్థ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Annaram Barrage Damage Issue : సీపేజీలు ఏర్పడిన 28, 38, 35, 48 పియర్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా పియర్ల వద్ద వెంట్లు, గేట్లను పరిశీలించారు. పియర్లకు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా అని ఆరా తీశారు. బుంగలు ఎప్పుడు ఏర్పడ్డాయి? వాటిని అరికట్టేందుకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నారు? ఎలా మరమ్మతులు చేశారు? అనే వివరాలను ఇంజినీర్లను అడిగారు. 2020లో మొదటిసారిగా క్యావిటీలను గుర్తించామని, వాటికి నివారణ చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు.

2022లో అన్నారంకు(Annaram Barrage)దాదాపు 18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకుందని, తర్వాత 2023లో 11 లక్షల ప్రవాహం వచ్చినా ఇబ్బందులు తలెత్తలేదని వివరించారు. రసాయనాలతో గ్రౌటింగ్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీపేజీ ఎలా ఏర్పడుతోంది. కిందిభాగం ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి, ఎంతమేర విస్తరించి ఉన్నాయి, తదితర వివరాలను తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఈఆర్టీ(ఎలక్ట్రో రెసిస్టెన్సీ టెస్ట్), జీపీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారికి తెలిపారు. బుంగలు ఏర్పడ్డ ప్రాంతాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బ్యారేజీకి సంబంధించిన డ్రాయింగ్స్, సీకెంట్ ఫైల్స్, అండర్ కవర్ డ్రాయింగ్స్, డిజైన్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు.

క్షుణ్నంగా పరిశీలిస్తూ, కొలతలు తీస్తూ, కారణాలు అన్వేషిస్తూ - మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్​ఏ నిపుణులు

NDSA Team Visit Sundilla Barrage : అన్నారం పరిశీలన అనంతరం ఎన్డీఎస్ఏ కమిటీ సుందిళ్లకు(Sundilla Barrage) చేరుకుంది. బ్యారేజీలోని 46 పిల్లర్ నుంచి 50 పిల్లర్ వరకు, కొంత దూరంలో ఉన్న 33 పిల్లర్ వద్ద పరిశీలన చేశారు. నీళ్ల తాకిడికి బ్యారేజ్ ముందు భాగంలోని కుంగిన సిమెంట్ బ్లాక్​ల స్థలాన్ని పరిశీలించారు.బ్యారేజీ పైకి చేరుకుని డిజైన్​ను పరిశీలించారు. 46 గేటు వద్ద గునుపంతో తవ్వి పరిశీలించారు. అక్కడి నుంచి 20 నుంచి 30 గేట్ల మధ్య దిగువ భాగంలోని బ్యారేజీ ను పరిశీలించారు. అనంతరం గోదావరి నీటి ప్రవాహాన్ని, గేట్లపై భాగాన రికార్డుల ప్రకారం పరిశీలించి హైదరాబాద్​కు తిరిగి వెళ్లిపోయారు.

జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తాం : ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

'కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు గుర్తించాం - విజిలెన్స్‌ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు'

Last Updated : Mar 8, 2024, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.