ETV Bharat / state

కూటమి విజయాన్ని ఆస్వాదిస్తున్న కార్యకర్తలు- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సంబరాలు - Alliance Leaders Victory Celebrations - ALLIANCE LEADERS VICTORY CELEBRATIONS

NDA Alliance Victory Celebrations in AP : కూటమి చరిత్రాత్మక విజయం సాధించడంతో శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫలితాలు వచ్చి మూడు రోజులు దాటినా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. బాణసంచా కాలుస్తూ, కేక్‌ కట్‌ చేస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు.

NDA Alliance Victory Celebrations in AP
NDA Alliance Victory Celebrations in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 8:57 PM IST

NDA Alliance Victory Celebrations in AP : రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో తెలుగుదేశం శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఫలితాలు వెలువడి మూడు రోజులు పూర్తయిన శ్రేణులు విరామం ప్రకటించకుండా సందడి చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు నుంచి తిరుమలగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేశారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద తెలుగు యువత కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. తర్వాత ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. సీఐడీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలన సాగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇకపై రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు.

కూటమి ఘన విజయం - ఊరువాడా మిన్నంటిన సంబరాలు - TDP Victory Celebrations in AP

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నాను గజమాలతో సత్కరించారు. కన్నా కార్యకర్తలతో కలిసి నందిగామ రోడ్డు నుంచి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యేగా ఎన్నికైన M.M కొండయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ శాఖల అధికారులు, కూటమి కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలుపొందడంతో నాని సతీమణి సుధారెడ్డి, మహిళలు సంబరాలు చేశారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని నాగలమ్మ అమ్మవారికి స్థానికులతో కలిసి సుధారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లికి 501 కొబ్బరికాయలు కొట్టి మెుక్కులు చెల్లించారు. తెలుగుదేశం ఘన విజయాన్ని కాంక్షిస్తూ మెుక్కులు చెల్లిస్తున్నామని సుధారెడ్డి తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళగా మహిళలందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కూటమి విజయంతో - రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు - TDP Workers Celebrations

కడప నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవీరెడ్డి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. మాధవీరెడ్డి, శ్రీనివాసులురెడ్డి డప్పులు వాయిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు అసెంబ్లీస్థానం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మూడు పార్టీలకు చెందిన నేతలు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. మహిళలు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం మరింత బాధ్యత పెంచిందని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

తిరుపతిలోని M.R పల్లి కూడలిలో తెలుగు యువత నాయకులు భారీ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కూటమి గెలుపుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరిగెడుతుందంటూ "అభివృద్ధి ఆరంభం" గోడ పత్రికలను ప్రదర్శించారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కార్యాలయం ముందు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

మోత మోగించిన శ్రేణులు- కూటమి ఘన విజయంతో ఊరువాడా మిన్నంటిన సంబరాలు - Celebrations in Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.