ETV Bharat / state

కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదిక - ఇంజినీరింగ్​ కాలేజీల్లో స్పేస్​ డే వేడుకలు - National Space Day Celebrations

National Space Day Celebrations in Vijayawada : చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. అందులో భాగంగా వివిధ ఇంజినీరింగ్​ కాలేజీల్లో స్పేడ్​ డే వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

space_day_celebrations
space_day_celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 3:12 PM IST

National Space Day Celebrations in Vijayawada : చంద్రయాన్‌-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ కీర్తి పెరిగింది. సరికొత్త ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెలరోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పలు ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల ప్రదర్శలు జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడ వేదికగా పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు స్పేస్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

స్పేస్‌ డే వేడుకలు : దేశవ్యాప్తంగా పలు ఇంజినీరింగ్‌ కళాశాల్లో స్పేస్‌ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర విజ్ఞాన అంశాలపై వాళ్లు తమ పరిశోధనలను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలు ఔత్సాహికులను ఆలోచింపజేశాయి.

పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్పేస్‌ డే : చంద్రయాన్‌-3 విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విట్‌ ఏపీ, కేఎల్‌ యూనివర్సిటీ, వెలగపూడి సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాలతోపాటు ఇతర విద్యాసంస్థలు శాటిలైట్‌ అనుసంధాన విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

ప్రతిభ కనబరిచిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు : విట్‌-ఏపీ విద్యార్థులు విశాట్‌ నానో శాటిలైట్‌ను రూపొందించారు. ప్రోటోటైప్‌ శాటిలైట్‌ కోసం ఏడాది శ్రమించినట్లు తెలిపారు. దీంతోపాటు అంబులెన్స్‌లో రోగులను తరలించే సమయంలో అవసరమైన వైద్య పరీక్షలు చేసేందుకు అనువైన పరికరాన్ని రూపొందించారు. వ్యవసాయదారులకు పనికొచ్చేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే బహుళ ఉపయోగకర డ్రోన్‌ రూపొందించారు.

కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇప్పటికే కేఎల్‌ శాట్‌-1 పేరిట ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. కిలోన్నర బరువు ఉన్న చిన్న తరహా ఉపగ్రహాన్ని గ్యాస్‌ బెలూన్‌కు అనుసంధానం చేసి నింగిలోకి పంపారు. అది భూమి గురుత్వాకర్షణ దాటుకుని సుమారు 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఈ శాటిలైట్‌ స్ఫూర్తిగా మరో శాటిలైట్‌కు రూపకల్పన చేస్తున్నారు. త్వరలో దాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

ఉద్యోగంలో సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లడమే నిజమైన సక్సెస్‌ : దీపికాపాటిల్ ఐపీఎస్​ - Deepika IPS

ఏఐ సాంకేతికత ఆవిష్కరణలు : చంద్రయాన్‌-2పై యువతకు మరింత అవగాహన పెంపొందించేందుకు విట్‌-ఏపీ విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ను అనుసంధానం చేస్తూ రోడ్డు ప్రమాదాలు జరిగితే వెంటనే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరే పరిశోధనలు చేస్తున్నారు ఈ విద్యార్థులు. భూమి సర్వేకు వినియోగిస్తున్న అత్యాధునిక పరికరాలపై వీఆర్‌ సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ప్రజలకు అవగాహన కలిపించారు. జలాశయాల్లో నీటి మట్టాన్ని గుర్తించేందుకు, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు.

స్పేస్‌ డే కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం తమలో నూతన ఉత్తేజాన్ని నింపిందని విద్యార్థులు అంటున్నారు. కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఇలాంటి ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని చెబుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.