Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in Krishna District : చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్థాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబీకులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారికి ధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడతలుగా వివిధ జిల్లాలలో ఈ యాత్ర చేపట్టారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి: భువనేశ్వరి
ప్రస్తుతం కృష్ణాజిల్లా గుడివాడలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుడివాడ నియోజకవర్గ సరిహద్దు ప్రాంతమైన అరిపిరాల వద్ద భువనేశ్వరికి కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అరెస్టుతో మోటూరు గ్రామంలో మృతిచెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు, అడుసుమిల్లి శశికళ కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Bhuvaneswari Nijam Gelavali Yatra : ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, వినాశక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమరావతి, పోలవరం, అన్నా క్యాంటీన్లను నీరుగార్చారని మండిపడ్డారు. అంతేగాక ప్రజల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేెశారు. ప్రతి వర్గానికి మంచి చేయాలని చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
భవిష్యత్తు తరాలు బాగు కోసం ప్రతి ఒక్కరూ తమ తోటి వారితో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ను గెలిపించి సీఎంను చేసింది గుడివాడ ప్రజలే అని భువనేశ్వరి గుర్తుచేశారు. ఎన్టీఆర్ ప్రజా సేవ కోసం తపించినట్లే చంద్రబాబు తపిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 360 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఏడున్నర కోట్ల మంది ఆకలి తీర్చారన్నారు.
హుందాగా ఉండే ఏపీ రాజకీయం రౌడీ రాజ్యమైంది : నారా భువనేశ్వరి
అయితే భువనేశ్వరి ఈరోజు కృష్టా జిల్లాకంటే ముందుగా నిజం గెలవాలి పేరుతో ఏలూరు జిల్లాలో పర్యాటించారు. జిల్లాలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను జీర్ణించుకోలేక మరణించిన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లడుతూ, విభజన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని అంధాకారంలోకి తీసుకెళ్లారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు.
ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : నారా భువనేశ్వరి