Nara Bhuvaneshwari Nijam Gelavali Program: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా "నిజం గెలవాలి" కార్యక్రమంతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుని ఓదార్చుతున్నారు. ఎవ్వరూ అదైర్యపడోద్దని, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.
చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే : నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra at Gutti: 'నిజం గెలవాలి' (Nijam Gelavali) యాత్రలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. గుత్తి మండలం ధర్మపురానికి చెందిన ఆంజనేయులు, భేతాపల్లి నివాసితులు జయమ్మ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కును భువనేశ్వరి అందించారు. పార్టీకి సేవ చేసిన వారి కుటుంబాలకు తెలుగుదేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధిస్తుందని అందరూ ధైర్యంగా ఉండి చంద్రబాబును (Chandra babu Naidu) ముఖ్యమంత్రిని చేసుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయంటూ భువనేశ్వరి పేర్కొన్నారు.
పాడేరులో 'నిజం గెలవాలి' - గిరిజనులతో ఆడిపాడిన భువనేశ్వరి
ఓటుతో కురుక్షేత్రాన్ని ఎదుర్కోవాలి: కార్యకర్తలు, నాయకులెవరూ అధైర్య పడొద్దని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. టీడీపీ ఎప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఎలా ఉంది? ఈ ఐదేళ్ల అరాచక పాలన ఎలా ఉందో మీకందరికీ తెలుసని, ఓటుతో కురుక్షేత్రాన్ని ఎదుర్కొందామని అందుకు మనమందరం యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ భువనేశ్వరి తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నింపారు. మరో నెలలో కురుక్షేత్రాన్ని ఎదుర్కొంటున్నామని, ఓటు అనే ఆయుధంతో మనం వాళ్లను ఓడించి, మన ప్రభుత్వాన్ని తీసుకొద్దామని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
"అన్నా క్యాంటిన్లో రోజుకు రెండున్నర లక్షల మంది భోజనం చేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం వచ్చి ప్రజల నోటి వద్ద అన్న లాక్కున్నారు. వచ్చే తరాలు, పిల్లల భవిష్యత్తు కోసం ఓటు అనే హక్కుతో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి." -నారా భువనేశ్వరి