Nandamuri Balakrishna Opening Jewellery Store in Kakinada of East Godavari : గురువారం కాకినాడలో జరిగిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి లెజెండరీ హీరో, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఇక బాలయ్యను చూడటాని అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ ప్రాంతమంతా జై బాలయ్యా జైజై బాలయ్య అనే పేరుతో మోగిపోయింది. ఈ క్రమంలో ఆయన అక్కడకు వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘‘నేను ఎక్కడైనా ఉంటాను ఊహించనిది చేయడమే నా నైజం, మంచి ప్రోగ్రామ్‌లు చేయాలనుకుంటున్నా. టీవీల ముందు కూర్చున్నవారికి అన్‌స్టాపబుల్‌గా మంచి సందేశం ఇస్తున్నా’’ అన్నారు. గోదారోళ్ల ప్రేమ, అభిమానం వెలకట్టలేనివని సంతోషం వ్యక్తం చేశారు.
నిర్మొహమాటంగా మాట్లాడటం గోదావరి నీళ్లలోనే ఉందని, తన మామగారిది పామర్రు అని అన్నారు. వెటకారం గోదారోళ్ల ప్రత్యేకతని అన్నారు. 1983లో టీడీపీకు మొదటి ఎన్నికలని, ఆ సమయంలో తాను కొత్త పెళ్లి కొడుకుగా తాను మామగారింటికి వచ్చానన్నారు. కాకినాడలో ప్రచారానికి కాకతాళీయంగా వెళ్తే, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీని సాధించామని తెలిపారు.
కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా ? : బాలయ్య బాబు అభిమానుసతో మాట్లాడుతున్నప్పుడు కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి బాలయ్య మీరు కథ సిద్ధం చేస్తే చేస్తానని బదులిచ్చారు. మోక్షజ్ఞ కథానాయకుడిగా ఆదిత్య 999కు మీరు దర్శకత్వం వహిస్తారా అని మరొకరు ప్రశ్నించగా ఆదిత్య 369 సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు కదా అంటూ నవ్వేశారు. బీబీసీలో కొకెనడా అని ఉంటుందని బ్రిటీష్ వారు కాకినాడగా మార్చేశారన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయని వేదపండితులకు పుట్టినిల్లని కొనియాడారు.
దండుమల్కాపురంలో హీరో బాలయ్య సందడి - విశేషంగా ఆకట్టుకుంటున్న పల్లెటూరు సెట్టింగ్
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి : సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు డాకూ మహారాజ్‌గా వస్తున్నానని బాలకృష్ణ అన్నారు. అమరావతిలో రెండువేల పడకలతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కథానాయిక సంయుక్త మేనన్, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి - 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం