Nampally Numaish Exhibition 2024 : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే హైదరాబాద్‌లో ఓ పండుగ మొదలవుతుంది. అదే నుమాయిష్. దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్‌గా పేరున్న నుమాయిష్ నాంపల్లిలో 45 రోజుల పాటు సందర్శకులను అలరిస్తుంది. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ప్రదర్శనను జనవరి 1న సీఎం రేవంత్‌రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరిగే నుమాయిష్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఎగ్జిబిటర్లు తరలివచ్చారు. దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2400 పైగా స్టాళ్లు నుమాయిష్‌లో కొలువుదీరాయి.
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ : ప్రత్యేకించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేరెన్నిక గల సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, చిన్న, మధ్య తరహా వాణిజ్య, వ్యాపారులు, ఔత్సాహిక మహిళా వ్యవస్థాపకులు అన్ని రకాల ఉత్పత్తులతో కూడిన విభిన్న స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రవేశానికి రూ.40 రుసుం తీసుకుంటున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతోంది.
నాంపల్లిలో సందడిగా సాగుతున్న నుమాయిష్ - ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్
Numaish Masnuat-e-Mulki Exhibition : నుమాయిష్మస్నూవత్ఇ ముల్కీ అంటే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనశాల. 1938లో స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు అంకురార్పణ జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న కొందరు విద్యావంతులు బృందంగా ఏర్పడి తొలి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా దానిని నాటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించాడు. మొదట్లో 100 స్టాళ్లతో ప్రారంభమైన ఎగ్జిబిషన్ అనతి కాలంలో దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
83rd Edition Of Numaish At Nampally Exhibition Grounds : ఏటా నాంపల్లిలో జరుగుతోన్న ఎగ్జిబిషన్ను మొదట పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వ్యాపారుల స్టాళ్లు, సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. స్థలాభావంతో నాంపల్లిలోని 23 ఎకరాల ఖాళీ స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్నే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని పిలుస్తుంటారు. కొన్నేళ్ల కిందట నుమాయిష్ పేరును ఆల్ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్‌గా మార్చారు. కానీ, అందరూ దీన్ని నుమాయిష్ గానే పిలుస్తుండటంతో 2009లో తిరిగి పాత పేరునే పెట్టారు.
Numaish 2024 hyderabad : నుమాయిష్‌ను ఆదర్శంగా తీసుకొని కమిటీలు ఏర్పడ్డాయి. ఆ కమిటీలు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాయి. ఆయా ప్రదర్శనల్లోనూ పలు రకాల వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు అందుబాటులో ఉంటాయి. కానీ నాంపల్లిలో ఏటా ఏర్పాటు చేసే నుమాయిష్‌కు ఉండే ఆదరణే వేరు. వ్యాపార రంగంలో పోటీ నెలకొన్న తర్వాత వినియోగ దారులను ఆకట్టుకునేందుకు పెద్దపెద్ద షాపింగ్ మాళ్లు ఏర్పాటయ్యాయి. వీధి వ్యాపారులు సైతం వినియోగదారులను ఆకట్టుకునేలా వస్తువులను విక్రయిస్తున్నారు.
నాంపల్లి గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సీఎం రేవంత్
Exhibition Grounds In Nampally : వ్యాపారులు ఎక్కడెక్కడి నుంచో కొత్త కొత్త వస్తువులను తీసుకొచ్చి మరీ నగరంలో విక్రయిస్తున్నారు. కానీ, నుమాయిష్‌లో విక్రయించే వస్తువుల ప్రత్యకతే వేరు. ఇక్కడ విక్రయించే దుస్తులకు ఎక్కువగా ఆదరణ ఉంటుంది. ఉత్తరాదికి చెందిన వంటకాలు నోరూరిస్తున్నాయి. మహిళలు అలంకరించుకునే వస్తువులకైతే కొదవే లేదు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నాంపల్లి ప్రధాన రహదారి నుంచి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకునే క్రమంలో పోలీసులు ఉంటారు.
పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు : స్టాళ్ల మధ్యలో కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు. మహిళల భద్రత నేపథ్యంలో నుమాయిష్‌లో షీటీం పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉంటూ నిఘా సాగిస్తున్నారు. ఇలా ఎన్నోఎన్నెన్నో రకాలుగా సందర్శకులను ఆకర్షిస్తున్న నుమాయిష్ పిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. 83వ ఎడిషన్‌గా ఏర్పాటైన ఈ ప్రదర్శనశాలను ఏటా లక్షల మంది సందర్శిస్తుంటారు. మరోవైపు దేశంలోనే అతిపెద్ద వస్తు ప్రదర్శనశాలైన నుమాయిష్ హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతుందని వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నుమాయిష్‌కు వేళాయే - జనవరి 1 నుంచి ఇక సందడే సందడి
షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్ నుమాయిష్ ఎగ్జిబిషన్.. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే..?