ICFAI student sustains Burn Injurie : హైదరాబాద్ శివారు శంకరంపల్లిలోని ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఓ యువతికి అనుమానాస్పద రీతిలో తీవ్రగాయాలయ్యాయి. తాను ఉంటున్న హాస్టల్లోని నాలుగో అంతస్థులో స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి, బకెట్‌లో ఉన్న నీటిని ఒంటిపై పోసుకోగానే శరీరంపై బొబ్బలు రావడంతో అప్రమత్తమైన యువతి స్నేహితుల సాయంతో ఆస్పత్రికి వెళ్లింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ కలిపిన నీటిని విద్యార్థిని తనపై పోసుకోవడం వల్లే గాయాలయ్యాయని అని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు, గాయానికి కారణం ఏంటనే విషయానిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై సంబంధిత విశ్వవిద్యాలయ వీసీ స్పందించారు. యాసిడ్ దాడి పేరిట వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఐసీఎఫ్ఏఐ చెందిన హాస్టల్ లో హౌస్ కీపింగ్ పనుల నిమిత్తం బకెట్‌లో వేడినీటితో పాటు యాసిడ్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేయగా మిగిలిన యాసిడ్ వాటర్ని బకెట్ లొనే ఉంచడం జరిగింది. బాధిత విద్యార్థిని బకెట్‌లో ఉన్నది నీరు అనుకొని కాళ్లు, చేతులు కడుకోవడానికి ప్రయత్నిచడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. ఇది గమనించిన తోటి విద్యార్థినులు, సిబ్బంది ఆమెని నగరంలోని అపోలో హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై ఈరోజు ఆమె తల్లిదండ్రులు మొకీల పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న మొకీల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ అంశంపై విశ్వవిద్యాలయ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు.
విద్యార్థినికి కాలిన గాయలవ్వడంపై స్పందించిన విశ్వవిద్యాలయ వీసీ : గాయపడిన విద్యార్థిని 7:20 కి రూం నుంచి బయటకు వచ్చి తన ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. ఎల్ఎస్ గణేశ్ తెలియజేశారు. వెంటనే ఆమెకి తమ క్లినిక్ లో చికిత్స అందించాన్నారు. హౌస్ కీపింగ్ వాళ్లు విద్యార్థులు ఉన్నప్పుడు మాత్రమే లోనికి వెళతారని వివరించారు. గదిలో లేఖ్య వర్ధిత ఒక్కతే ఉందని యువతి స్వస్థలం తిరుపతి అని వెల్లడించారు. యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలున్నాయన్నారు. అయితే లేఖ్యకు గతంలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని తెలిపారు. కారిడార్ లో సీసీటీవీ విజువల్స్ పోలీసులకు అందించామని తెలిపారు. క్లూస్ టీం అక్కడ వస్తువులను అన్ని తీసుకెళ్లారని తెలిపారు.
"15వ తేదీన యువతికి గాయాలు అయ్యాయి. ఇక్కడే ప్రాథమిక చికిత్స చేసి మంచి ఆసుపత్రికి చేర్పించాం. యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న యాసిడ్ దాడి పేరిట ప్రసారం అయిన వార్తలు తప్పుడు ప్రచారమే. హాస్టల్లో అన్ని రూంలకు పటిష్ఠ భద్రత ఉంది. మా దృష్టికి వచ్చిన విషయం ప్రకారం ఆ యువతికి వేడినీళ్ల వల్లే అలా జరిగి ఉండొచ్చు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు"- డాక్టర్. ఎల్ఎస్ గణేశ్ , ఐఎఫ్సీఏఐ వీసీ