ETV Bharat / state

బ్యాంకులో డబ్బు డ్రా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

బ్యాంకుల వద్ద మాటు వేసి చాకచక్యంగా చోరీ చేస్తున్న ముఠా - పలుచోట్ల చోరీలు జరుగుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు

Beware Of Thieves At Banks
Beware Of Thieves At Banks (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Beware Of Thieves At Banks : డబ్బు విత్ డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!! మిమ్మల్నే ఓ కంట కనిపెడుతూ ఓ ముఠా తిరుగుతోంది. డబ్బు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే సర్వం కోల్పోవడం ఖాయం. నగదు విత్ డ్రా చేసేటప్పుడు ఆదమరిచారో అంతే సంగతులు. ఉన్నదంతా దోచేస్తారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బ్యాంకుల వద్ద ఇలా చోరీలు చేసే ముఠాలు పెరిగిపోతున్నాయి. దీంతో బ్యాంకుకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై బ్యాంకుల వద్ద భద్రతా చర్యలతో పాటు ముఠాను పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నట్లుగా కనిపించినా నగదు తస్కరిస్తున్నారు తస్మాత్​ జాగ్రత్త.

కర్ణాటక దొంగల ముఠాగా అనుమానం : జనగామలో మూడు నెలల క్రితం జరిగిన ఓ చోరీ ఘటనలో జనగామ క్రైమ్‌ ఎస్సై మోదుగుల భరత్‌ నేతృత్వంలో క్రైమ్‌ విభాగం పోలీసులు చోరీ దర్యాప్తులో భాగంగా నిందితుల్లో కర్ణాటకు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద చోరీ ఘటనలు వెలుగు చూస్తుండటంతో కర్ణాటకు చెందిన ముఠా సభ్యులుగానే పోలీసులు అనుమానిస్తూ దర్యాప్తు చేపట్టారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు :

  • చాకచక్యంగా మాటలు కలిపి, నగదును కాజేస్తున్న అగంతకుల పట్ల ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి.
  • దొంగలు వృద్ధులు, నడి వయస్సులు, అంతగా చదువు రాని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో తేలడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • వృద్ధులు, నడి వయస్సుల వారు బ్యాంకులకు వెళ్తున్న తరుణంలో వెంట ఒకరిని తీసుకువెళ్తే క్షేమం.
  • అలాగే నిరక్షరాస్యులు డ్రా చేసిన తరువాత ఏమరుపాటుగా ఉండొద్దు.
  • కార్లు, ద్విచక్రవాహనాల్లో డబ్బులను పెట్టుకున్నప్పుడు నిర్లక్ష్యం వహించరాదు.
  • బ్యాంకు లోపల, బయట పూర్తిగా సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలి
  • పార్కింగ్‌ వద్ద కూడా పలు జాగ్రత్త చర్యలు, సెక్యూరిటీ గార్డుల సాయం తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
  • బ్యాంకులతో పాటు మార్గ మధ్యలో ఖాతాదారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెబుతున్నారు.

వరుస సంఘటనలు ఖాతాదారుల బెంబేలు : జనగామ పట్టణంలో మూడు నెలల క్రితం ఓ బ్యాంకులో నగదు విడుదల చేసుకున్న వ్యక్తిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు నుంచి గమనిస్తూ బయటకు వెళ్లే క్రమంలో బైక్​లపై వెంబడించారు. ఆయన క్యాష్​ను కారులో పెట్టి, మధ్యలో ఓ పని మీద వాహనాన్ని నిలిపివేశారు. దీంతో దుండగులు కారు అద్దాలను పగులగొట్టి రూ.2లక్షలను చోరీ చేశారు. అలాగే గత నెల 18న జనగామలోని ఓ బ్యాంకులో డబ్బులను విత్​డ్రా చేసిన వ్యక్తిని బ్యాంకులోనే ఉండి గమనించిన అగంతకులు బైక్​లపై వెంబడించారు. మధ్యలో కారు ఆపిన క్రమంలో దుండగులు అద్దాలు పగులగొట్టి క్యాష్​ను ఎత్తుకెళ్లారు.

నగదు డ్రా చేసుకుని తిరిగి వెళ్తుండగా చోరీ : స్టేషన్‌ఘన్‌పూర్‌లో 6 రోజుల కింద ఓ ఖాతాదారుడు పంట, గృహలోన్​ కింద రూ.3.10 లక్షలు తీసుకొని వాహనంలో పెట్టుకున్నాడు. తిరిగి వెళ్తుండగా దుండగులు మాటు వేసి మాయమాటలు చెప్పి నగదు అపహరించుకుపోయారు. బాధితుడు లబోదిబోమంటూ విలపించాడు. దేవరుప్పుల మండలంలో కొద్ది రోజుల కింద ఓ ఖాతాదారుడు రూ.40 వేలను డ్రా చేసుకొని తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. తిరుగు పయణంలో దుండగులు వెంబడించి, మాయమాటలు చెప్పి కవర్లో ఉన్న డబ్బును తస్కరించారు. ఇలా పలుచోట్ల వరుసగా చోరీలు జరగడం గమనార్హం.

"బ్యాంకుల వద్ద ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేస్తున్న ఘటనలు జరగడంతో అప్రమత్తత చర్యలు ప్రారంభించాం. బ్యాంకు అధికారులకు సీసీ కెమెరాలు, ఇతర భద్రత చర్యలు తీసుకోవాలని సూచించి జిల్లా వ్యాప్తంగా అమలు చేయిస్తున్నాం. చోరీ ఘటనలపై దర్యాప్తు చేపట్టాం. సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయిస్తున్నాం"- రాజమహేంద్రనాయక్, డీసీపీ

పేదల పేరుతో బ్యాంక్ అకౌంట్స్ - దుబాయ్ నుంచి ఆపరేటింగ్ - 2 నెలల్లో రూ.175 కోట్ల స్కామ్ - RS 175 CRORES CYBER FRAUD IN HYD

సినిమా రేంజ్​లో చోరీ ప్లాన్​ చేశాడు - కత్తితో మినీ ఏటీఎంలోకి చొరబడ్డాడు - కట్​ చేస్తే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.