ETV Bharat / state

'అక్కడ కాలనీకో కథ - కుటుంబానిదో వ్యథ' - కష్టాల కడలిలో మున్నేరు బాధితులు - MUNNERU FLOOD VICTIMS PROBLEMS - MUNNERU FLOOD VICTIMS PROBLEMS

Munneru Flood Victims Story : ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు జల ఖడ్గం ఖమ్మం ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచే సరికి ఉరుముకుంటూ తరుముకొచ్చిన వరద విలయం బాధితులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన మున్నేరు ముంపు ప్రాంత వాసుల్ని కకావికలం చేసింది. తరుముతున్న మున్నేరును చూసి గజగజ వణికిన బాధితులు ప్రాణాలు కాపాడుకునేందుకు బతుకు జీవుడా అంటూ మిద్దెపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నవారు మున్నేరు శాంతించడంతో ఇళ్లకు చేరుకున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన గూడు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Munneru Floods Latest News
Munneru Floods Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 4:54 PM IST

Updated : Sep 2, 2024, 6:45 PM IST

Munneru Flood Victims Story : చరిత్రలో మొదటిసారి అత్యంత గరిష్ట నీటిమట్టం 36 అడుగులు దాటి మహోగ్రంగా ప్రవహించిన మున్నేరు ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. గంటల్లోనే ఊహించని ఉత్పాతంలా ముంచెత్తిన మున్నేరు తమను కోలుకోలేని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు. ఆదివారం (సెప్టెంబరు 1వతేదీ) మేల్కొనక ముందే ముంపు ప్రాంతాలను కకావికలం చేసింది.

ఎక్కడ చూసినా దయనీయ దృశ్యాలే : దానవాయిగూడెం కాలనీ, గణేశ్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతం, సారథినగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వరనగర్, బొక్కల గడ్డ, మోతీనగర్, పంపింగ్ వెల్ రోడ్, ధంసలాపురం కాలనీల్లో ఎటుచూసినా దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మున్నేరు తరమడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు ఇళ్లను వదిలి కట్టుబట్టలతో వెళ్లిన బాధితులు తిరిగి వచ్చేసరికి సర్వం కోల్పొయిన దీనావస్థలు ఉన్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లకు చేరుకున్న బాధితులు ఇళ్లను, ఇంటి పరిసరాలను చూసి గుండెలవిసేలా విలపిస్తున్నారు.

వరదల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం : సీఎం రేవంత్ రెడ్డి - EX GRATIA FOR TG FLOOD VICTIMS

కాలనీకో కథ కుటుంబానిదో వ్యథ : దాదాపు 15 కాలనీల్లో ఎటుచూసినా వరద మిగిల్చిన విషాదాలే కనిపిస్తున్నాయి. ఉప్పెనలా ఊరి మీద పడ్డ మున్నేరు తాకిడికి ఇళ్లలోని నిత్యావసరాలు సహా దుస్తులు, వంటసామగ్రి, ఫర్నీచరు, బీరువాలు,టీవీలు,ఫ్రిజ్‌లు కూలర్లు, వాషింగ్ మిషన్లు వరదలో కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. కిరాణా దుకాణాల్లో సామగ్రి పాడైంది. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్ , రేషన్ , డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తడిసి ముద్దయ్యాయి. కట్టుబట్టలు తప్ప తమకేమీ మిగల్లేదని, గంగమ్మ సర్వం తుడిచిపెట్టుకుపోయిందని విలపిస్తున్నారు.

ముంపు కాలనీల్లో బురద మేటలు : వరద ఉద్ధృతి తగ్గినా ముంపు కాలనీల్లో బురద మేటలు కనిపిస్తోంది. కాలనీల మధ్య ఉన్న రహదారులు, ప్రధాన రహదారికి వెళ్లేందుకు నిర్మించిన సీసీరోడ్లు కొట్టుకుపోయాయి. అంతర్గత రహదారులన్నీ పూర్తిగా దెబ్బతిని మోకాల్లోతున గుంతలు పడ్డాయి. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేని దుస్థితి. పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి.

'మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు' - మున్నేరు వంతెనపై వరద బాధితుల ఆందోళన - Flood victims at Munneru bridge

పురుగు పుట్ర, పాము, విష పురుగులు ఇళ్లలోకి వచ్చాయని బెంబేలెత్తిపోతున్నారు. ప్రవాహానికి కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు, మొద్దులు, రేకులు ఇళ్ల మధ్య కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. కాలనీల్లో తాగునీరు దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు. కనీసం తమ గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యారని బాధాతప్త హృదయంతో చెబుతున్నారు.

పునరావాస కేంద్రాల్లో బాధితులకు ప్రభుత్వం భోజనం సదుపాయం కల్పించడమే కాక. ఇళ్లల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఆహార పొట్లాలు అందిస్తోంది. ఇప్పటికీ ముంపు కాలనీలు చాలావరకు అంధకారంలోనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా పూర్వస్థితిలోకి తీసుకురావాలని వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనం వేడుకుంటున్నారు.

జల విలయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కకావికలం - ఊరూఏరును ఏకం చేసిన జడివాన - Heavy Rains Floods In Khammam

Last Updated : Sep 2, 2024, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.