Mother Takes her Handicapped Son For Tenth Exams : బిడ్డ కోసం తల్లి పడే కష్టాలు మాటల్లో చెప్పలేం. ఎంత కష్టమైనా శ్రమించి ఇష్టంగా చేస్తుంటారు. అది కష్టంగా భావించకుండా పిల్లల విజయ మార్గాలకు ప్రతీక అన్నట్లుగా చూస్తారు తల్లిదండ్రులు. ఆ దిశగా ఓ తల్లి దివ్యాంగుడైన తన కుమారుడి కోసం శ్రమిస్తూ బంగారు భవిష్యత్తు అందించడానికి బాటలు వేస్తోంది. కుమారుడిని ప్రయోజకుడిగా చేయాలనే తపన, ఉన్నత చదువులు చదివించాలనే ఆరాటం, ఆ తల్లి ఎంతటి కష్టానికైనా వెనుకాడదని చెప్పడానికి ఇదే నిదర్శనం.
దివ్యాంగుడైన తన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్‌కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. అయినా చదువు కొనసాగించాడు. 15 నెలల ప్రాయంలోనే చరణ్(Charan) తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లి పద్మ బీడీ కార్మికురాలిగా పని చేస్తూ అమ్మ, నాన్నలతో కలిసి ఉంటున్నారు. తాత సహకారంతో బాలుడు పాఠశాలకు వెళ్లేవాడు. ప్రస్తుతం తాత వయసు సహకరించడం లేదు. దీంతో పద్మ తన కుమారుడిని నిర్మల్‌లోని పరీక్ష కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. చేతులపై ఎత్తుకుని కేంద్రంలోకి తీసుకెళ్లారు. దివ్యాంగులకు కేటాయించిన స్క్రైబ్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్ష రాస్తున్నాడు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన - చిన్నారి వైద్యానికి సీఎం రేవంత్ సాయం
20 గంటల పాటు చీకటి గదిలో బందీగా బధిర బాలుడు - ఆ తర్వాత ఏమైందంటే?