అనారోగ్యంతో కుమార్తె మృతి - తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆగిన తల్లి గుండె - mother heart attack
Mother Heart Attack by death of child in Anakapalli District : నిమిషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మృతి చెందిన సంఘటన అనకాపల్లి దేవరాపల్లిలో జరిగింది. ఫిట్స్ రావడంతో మరణించిన మేఘన చూసి ఆమె తల్లి ఉషారాణి తట్టుకోలేక పోయింది. కుమారై మరణవార్తను బంధువులకు తెలియజేస్తూ సోఫాలోనే కుప్పకూలిపోయింది.
![అనారోగ్యంతో కుమార్తె మృతి - తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆగిన తల్లి గుండె mother_dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-03-2024/1200-675-20974166-thumbnail-16x9-mother-dead.jpg?imwidth=3840)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 3:00 PM IST
|Updated : Mar 13, 2024, 4:25 PM IST
Mother Heart Attack by death of child in Anakapalli District : తన ప్రాణాలు పణంగా పెట్టి పురిటి నొప్పులు భరిస్తూ బిడ్డకు తల్లి జన్మనిస్తుంది. ఆ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేస్తుంది. ఆ బిడ్డకు చిన్నపాటి కష్టం వచ్చినా విలవిల లాడుతుంది. అలాంటిది బిడ్డ ప్రాణాలతో లేదన్న విషయాన్ని ఏ తల్లైనా భరిస్తుందా ? ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఆ బిడ్డతోనే తన పయనం అనుకొని తల్లి తుది శ్వాస విడిచింది. ఒక్కగానొక్క కుమారై కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి తట్టుకోలేక నిమిషాల వ్యవధిలో ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో జరిగింది.
Mother and Daughter Died Within Minutes : విశాఖలోని ద్వారకా నగర్‌కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి వచ్చారు. భార్య ఉషారాణి (51), కుమార్తె సాయి మేఘనతో (18) కలిసి స్థానిక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘన కొన్నేళ్లుగా ఫిట్స్‌తో బాధ పడుతోంది. మంగళవారం ఉదయం (మార్చి 12) 8 గంటల సమయంలో ఫిట్స్ రావడంతో ఇంట్లోనే పడిపోయింది. తల్లిదండ్రులిద్దరూ ఎంత కదిపినా చలనం లేకపోవడంతో అపార్టుమెంటులోనే నివాసం ఉంటున్న డాక్టర్‌ను పిలిచారు. ఆయన పరీక్షించి మేఘన మరణించినట్లు ధ్రువీకరించారు.
కళ్లెదుటే భర్తను హత్య చేసిన మేనల్లుడు- గుండెపోటుతో భార్య మృతి
Anakapalli District : అప్పటివరకు బాగానే ఉన్న తన కుమార్తె ఇక లేదన్న విషయం జీర్ణించుకోలేని మాతృమూర్తి హృదయం తల్లడిల్లింది. కుమార్తె మరణవార్తను బంధువులకు ఫోన్లో చెప్తూ ఉషారాణి తీవ్ర మనోవేదనకు గురై సోఫాలో కుప్పకూలిపోయారు. స్పృహ తప్పిపోయిందని భావించిన శ్రీనివాసరావు ఆమె ముఖంపై నీళ్లు చల్లి లేపేందుకు యత్నించారు. ఎంతకీ లేపకపోవడంతో అనుమానం వచ్చి డాక్టర్‌ను పిలిచి పరీక్ష చేయించారు. గుండెపోటుతో ఉషారాణి మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు.
కూలీలను ఢీ కొట్టిన రైలు - బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తోటి కూలీల డిమాండ్
నిమిషాల వ్యవధిలో భార్య, కుమార్తె మృతి చెందడంతో శ్రీనివాసరావు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయన్ను సముదాయించడం ఎవరి వల్లా కాలేదు. ఈ హృదయ విదారక సంఘటనను చూసి స్థానికులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే తల్లి, కుమార్తె మరణించడంతో దేవరాపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓవైపు అప్పులు - మరోవైపు కుమార్తె కాపురంలో సమస్యలు - పురుగు మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం