ETV Bharat / state

బిడ్డ బారసాల నాడే అమ్మ ఆయువు తీరే - వేడుక ముగిసిన గంటలోనే తీరని విషాదం - Mother Died After Child Barasala

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 11:44 AM IST

Mother Died After Child Barasala : ఓ తల్లీబిడ్డల పేగు బంధాన్ని, ప్రేమానుబంధాలను చూసి విధి ఓర్వలేకపోయింది. ఆ ఆనందాన్ని, మధుర క్షణాలను వెంటనే చెరిపేయాలని తలచిందో ఏమో ఆ కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చింది. కుమార్తె బారసాల ముగిసిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో తల్లి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Mother Passed After Barasala Celebration
Mother Died After Child Barasala (ETV Bharat)

Mother Passed After Barasala Celebration : 'అమృతానికి, అర్పణకు అసలు పేరు అమ్మ. అనుభూతికి, ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడిజేరగ తొలి వాకిలి అమ్మ' అన్నారు ఓ మహాకవి. అటువంటి తొలి వాకిలి, అమ్మా అను తియ్యదనానికి బారసాల నాడే ఓ పసికందు దూరమైన హృదయ విదారక ఘటన శుక్రవారం హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఊయల ఊపి జోలపాటలు పాడే తల్లి, పురుడు రోజునే దూరమవ్వటంతో అక్కడున్న బంధుగణమంతా మూగపోయింది. కుమార్తె బారసాల ముగిసిన గంటల వ్యవధిలోనే గుండెపోటుతో తల్లి మృతి చెందడంతో, ఆ కుటుంబసభ్యుల రోదన మిన్నంటింది. పాపం ఆ పాపాయికి ఏం తెలుసు విధి ఆడిన వింత నాటకంలో తన తల్లి తనను శాశ్వతంగా వీడిందని.

మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన మామిడాల రాజశేఖర్‌ - శిరీష (28) దంపతులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. వీరికి రెండో సంతానంగా 21 రోజుల క్రితం కుమార్తె పుట్టింది. ఆ పసికందుకు గురువారం బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాద్‌లోనే బారసాల ఘనంగా నిర్వహించారు. రాత్రి వరకు అందరూ కలిసి మెలిసి భోజనాలు చేసి, ఆనందోత్సాహాల మధ్య సందడిగా వేడుక ముగించుకుని అంతా నిద్రలోకి జారుకున్నారు.

బారసాల నాడే - అమ్మ ఆయువు తీరే : ఆ ఆనందాన్ని, మధుర క్షణాలను చూసి విధి ఓర్వలేనితనంగా పగబట్టింది. అంతలోనే ఆ కుటుంబానికి జీవిత కాలపు దుఃఖాన్ని, వేదనను మిగిల్చింది. అర్ధరాత్రి దాటాక కుమార్తె తల్లి శిరీష ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రాణాలు విడిచింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలవిసేలా రోదించారు. ఊయల ఊపి జోలపాటలు పాడే తల్లి పురుడు రోజునే దూరం కావడంతో స్వగ్రామమైన ఖానాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని శుక్రవారం రాత్రి ఖానాపూర్‌ తీసుకొచ్చారు.

మరణంలోనూ వీడని బంధం - అమ్మ కోసం కుమార్తె, పెంపుడు కుమారుడు కోసం తల్లి వేర్వేరు ఘటనల్లో మృతి - Heartbreaking Incidents Telangana

'నేనేం పాపం చేశానమ్మా నన్నొదిలి వెళ్లిపోయావ్' - పసిపాప రోదన చూసి ఆ ఊరి గుండె బరువెక్కింది - Daughter Begged For Mother Funeral

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.