Frustrated with Son Behavior mother commits suicide : కుమారుడి విలాసాలకు తల్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన కాయితోజు యాకయ్య-విజయ(43) దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే విజయ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతోంది. ఈ క్రమంలో తన పొలంలో వేసిన జామాయిల్ తోటను అమ్ముకుని, వాటితో వచ్చిన డబ్బులతో మెరుగైన వైద్యం చేయించుకోవాలని నిర్ణయించుకుంది.
అనుకున్నట్లుగానే ఇటీవల జామాయిల్ పంటను విక్రయించగా, కొంత సొమ్ము చేతికి వచ్చింది. ఆ డబ్బును ఇంట్లో దాచగా, పెద్ద కుమారుడు రణధీర్ ఆ మొత్తాన్ని తన విలాసాలకు ఖర్చు చేసేశాడు. ఆలస్యంగా గుర్తించిన తల్లి విజయ డబ్బుల గురించి అడగగా, తన అవసరాల నిమిత్తం వాడుకున్నానని, మళ్లీ ఇచ్చేస్తానంటూ చెబుతూ వస్తున్నాడు. ఆసుపత్రి వెళ్లాలని, డబ్బులు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కుమారుడు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
మెదక్ జిల్లాలో విషాదం - తమ్ముడి ప్రేమ వివాహానికి అన్న బలి
ఓవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు పెద్ద కుమారుడి నిర్వాకంతో విసుగు చెందిన విజయ, ఇక తనకు చావే శరణ్యం అనుకుంది. గ్రామ శివారులోని బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆమె మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీశారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.2 కోట్లు పోగొట్టాడని కుమారుడిని చంపిన తండ్రి : బెట్టింగులకు అలవాటు పడిన యువకుడు రూ.కోట్లలో అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడనే ఆక్రోశంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. నిద్రిస్తుండగా కొట్టి హతమార్చాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలోని బాగిర్తిపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముకేశ్ కుమార్(28) అనే యువకుడు చేగుంటలో రైల్వే విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి సుమారు రూ.2 కోట్లకు పైగా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి మేడ్చల్‌లో ఉన్న ఒక ఇంటిని, రెండు ప్లాట్లను అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మరో ఇంటిని అమ్మడానికి సిద్ధమయ్యాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన తండ్రి సత్యనారాయణ ముకేశ్ నిద్రిస్తుండగా ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Online Gaming Addiction : తల్లీబిడ్డల ప్రాణాలను తీసిన.. ఆన్లైన్ గేమ్