ETV Bharat / state

పిల్లలను బావిలోకి తోసి తానూ దూకిన తల్లి - ఇద్దరు మృతి - Mother Committed Suicide - MOTHER COMMITTED SUICIDE

Mother Committed Suicide In Mahabubabad : మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వెంకటాపురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది. కుమారుడు ముఖేష్‌ (10) సురక్షితంగా బయటపడగా, తల్లి లావణ్య (30), కుమార్తె నిత్యశ్రీ (6) మృతి చెందారు.

Mother Committed Suicide
Mother Committed Suicide In Mahabubabad
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 1:44 PM IST

Updated : Mar 23, 2024, 2:00 PM IST

Mother Committed Suicide In Mahabubabad : పచ్చని సంసారంలో కలహాలు చిచ్చు రేపాయి. కుమార్తె సహా తల్లి ప్రాణాలు తీశాయి. మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భర్తతో గొడవ పడి, ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది.

క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి, ఆ తర్వాత తానూ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో తల్లీకుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామ శివారు వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల మురళికి, సిద్దిపేట జిల్లాకు చెందిన లావణ్యతో (30) వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు ముఖేష్ (10), కుమార్తె నిత్యశ్రీ (6) ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో గత కొద్ది కాలం నుంచి భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

రాత్రి గొర్రెల దగ్గర కాపలా ఉండగా, బావిలోంచి శబ్దాలు వినబడటంతో దగ్గరకు వెళ్లాను. అక్కడ పిల్లవాడు కనబడటంతో బయటకు తీశాను. పిల్లవాడు మా అమ్మ నన్ను, చెల్లిని బావిలో పడేసింది అని చెప్పాడు. దీంతో ఊర్లోవారందరికీ ఈ విషయాన్ని తెలియజేశాను. తల్లీకుమార్తెను బయటకు తీసి, ఆసుపత్రికి తరలించాం. అప్పటికే ఆ ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. - స్థానికుడు

ఇద్దరు కుమారులతో కలిసి ఉరివేసుకుని తల్లి ఆత్మహత్య

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య లావణ్య అనుమానిస్తూ ఉండడమే ఇందుకు కారణం. శుక్రవారం భర్తతో ఘర్షణ పడి క్షణికావేశంలో గ్రామంలోని మంచి నీటి బావి దగ్గరకు తన పిల్లలతో కలిసి వెళ్లింది. కుమారుడు, కుమార్తెను మంచి నీటి బావిలోకి నెట్టి, ఆపై తానూ దూకింది. బాలుడు బావిలోని పైపును పట్టుకొని బయటకు వచ్చి, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తల్లీకుమార్తెను బయటకు తీయగా, అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న నెల్లికుదురు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తల్లీబిడ్డల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తల ఘర్షణ అభంశుభం తెలియని బాలుడికి తల్లిని దూరం చేసిందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

కూతురు ఎంబీబీఎస్ చదవొద్దని తల్లి ఆత్మహత్య

Mother commits suicide with children : గాంధీనగర్‌లో విషాదం.. కట్నం వేేధింపులకు కవల పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Last Updated : Mar 23, 2024, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.