ETV Bharat / state

ఐసీఐసీఐ బ్యాంక్‌ బాధిత ఖాతాదారులకు ఊరట - నగదు వెనక్కి ఇచ్చే ప్రక్రియ స్టార్ట్

ఐసీఐసీఐ బ్యాంక్‌ బాధిత ఖాతాదారులకు ఊరట

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

icici_bank_giving_cash_back
icici_bank_giving_cash_back (ETV Bharat)

ICICI Bank Scam in Palnadu District Updates : పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతినగర్‌ ఐసీఐసీఐ బ్రాంచ్‌ల్లో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత ఖాతాదారులకు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్‌ ఉన్న నరేశ్‌ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్‌ ఉన్నతాధికారులు నిర్ధారించారు. మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు.

ఈ నెల 3న చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో నరేశ్‌ చేసిన మోసాలను బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ సందీప్‌ మెహ్రా గుర్తించారు. బాధిత ఖాతాదారులను విచారణ చేసి వారి పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపై ఆయన విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి ఈ కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో గుంటూరు సీఐడీ అదనపు ఎస్పి ఆదినారాయణ, సీఐ సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలో పదిమంది బృందం గత గురువారం చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో విచారణ ప్రారంభించారు. బ్యాంకులో సిబ్బందితోపాటు ఖాతాదారులను శనివారం వరకు విచారించారు.

ICICI Bank Money Refunding Process : ఈ నేపథ్యంలోనే గత మేనేజర్ నరేశ్​ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. తాను ఒక్కడినే మోసానికి పాల్పడలేదని, ఎవరెవరి పాత్ర ఉందో ఆ వీడియోలో వెల్లడించారు. ఇవన్నీ నిర్ధారించుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు చేపట్టారు. ఇవాళ బాధిత ఖాతాదారులను పిలిపించి వారు పోగొట్టుకున్న నగదును తిరిగి ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా నష్టపోయిన ప్రతి ఖాతాదారుడికి బ్యాంక్ తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. తక్షణమే స్పందించి తమకు అండగా నిలిచిన బ్యాంకు అధికారులతో పాటు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఈనాడు-ఈటీవీ భారత్​కి​ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

అసలేం జరిగిదంటే : పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఖాతాల్లో లేదని తెలిసి హతాశులయ్యారు. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి రూ. కోట్లలో నగదు కొల్లగొట్టారు. బ్యాంకు ఖాతాదారుల నగదు, బంగారం, ఎఫ్‌డీ నగదు మాయం చేశారు. బాధితులు రెండు నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు. ఆ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల బాండ్లు చెల్లవని అందులో నగదు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచిన బ్యాంకు మేనేజర్ - కోట్లలో స్వాహా

72 ఖాతాల నుంచి రూ.28 కోట్లు దారి మళ్లింపు - సీఐడీ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.