ETV Bharat / state

'నా ముందస్తు బెయిల్​ను హైకోర్టు తిరస్కరించలేదు' - మోహన్​బాబు మరో ట్వీట్ - MOHAN BABU LATEST TWEET

మంచు మోహన్​బాబు మరో ట్వీట్​ - ముందస్తు బెయిల్​ను తిరస్కరించలేదంటూ పోస్టు - మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించిన మోహన్​బాబు

Mohan Babu Tweet Latest
Mohan Babu Tweet Latest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 3:10 PM IST

Mohan Babu Tweet Latest : సీనియర్​ నటుడు మోహన్​బాబు మరోసారి ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. "ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. నా ముందస్తు బెయిల్​ను తిరస్కరించలేదు. వాస్తవాలను మాత్రమే బయటపెట్టాలని మీడియాను కోరుతున్నాను." అని మోహన్​బాబు తన ఎక్స్​ ఖాతాలో ట్వీట్​ చేశారు.

హైకోర్టులో ముందస్తు బెయిల్​ పిటిషన్​లో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని వార్తలు వచ్చాయి. తాజాగా మోహన్​బాబు తన పోస్ట్​లో ఈ వార్తల్లో నిజం లేదని ఖండించారు. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదుదారు ఎం.రంజిత్​కుమార్​కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబందించి కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ కేసు మొత్తం నేపథ్యం విలేకరిపై దాడి కేసులో మోహన్​బాబుకు ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి.

అసలేం జరిగింది : వారం రోజుల క్రితం హైదరాబాద్​లోని జల్​పల్లిలో సినీనటుడు మోహన్​బాబు, మనోజ్​ కుమార్​ మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మోహన్​బాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్​ దంపతులు మోహన్​బాబు నివాసానికి చేరుకోగా.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గేట్లను తెరవలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన మంచు మనోజ్​ గేట్లను తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. మంచు మనోజ్​తో పాటు అక్కడే ఉన్న మీడియా ఆయనతో పాటు లోపలికి వెళ్లింది.

ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్​బాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈక్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. కొందరిపై ఆయన చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్​కు గాయం అయింది. దీంతో మోహన్​బాబుపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మంచు మనోజ్​, మంచు విష్ణు బాడీగార్డుల మధ్య వివాదం జరిగింది. పరస్పరం ఒకరిని ఒకరు తోసుకుంటూ కాస్త ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్​ లోపలినుంచి చొక్కా చిరిగి బయటకు వచ్చారు. వీరి కుటుంబ కలహాలపై పోలీసు శాఖ సీరియస్​ అయింది. మంచు మనోజ్​, మంచు విష్ణులను పిలిపించి రాచకొండ సీపీ విచారణ చేశారు. మంచు మోహన్​బాబుకు నోటీసులు ఇచ్చినా ఆరోగ్య బాగోపోవడంతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లారు. దీంతో ఆయన విచారణకు హాజరు కాలేదు. అనంతరం పోలీసులు అరెస్టు కాకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్​ పిటిషన్​ను మోహన్​బాబు దాఖలు చేశారు.

నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు - నేను కొట్టడం తప్పే: మోహన్‌బాబు

జల్​పల్లిలో మళ్లీ ఘర్షణకు దిగిన మంచు బ్రదర్స్​ - మోహన్​బాబుపై హత్యాయత్నం కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.