Mohan Babu Another Audio Release : జల్పల్లిలోని తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై చేయి చేసుకోవడం పట్ల చింతిస్తున్నట్లు నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 11 నిమిషాల నిడివితో కూడిన ఆడియో సందేశాన్ని విడుదల చేసిన మోహన్ బాబు మీడియా ప్రతినిధిని కొట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు. తన ఇంట్లోకి దూసుకొస్తున్న వారు తనపై దాడి చేసే అవకాశం ఉందని, ఆ ఘర్షణలో ఎవరో తెలియక చేయి చేసుకున్నట్లు మోహన్ బాబు స్పష్టం చేశారు.
ఇంట్లోకి వచ్చి ఏకాగ్రతకు, ప్రశాంతతను భగ్నం చేశారు : నీతిగా, ధర్మంగా బతకాలన్నదే తన ఆలోచనని, సినిమాల్లో తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదని మోహన్ బాబు పేర్కొన్నారు. మీడియా పట్ల గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని, తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరెస్టయ్యే వాడినని మోహన్ బాబు వెల్లడించారు. తన ఇంట్లోకి వచ్చి ఏకాగ్రతకు, ప్రశాంతతను భగ్నం చేశారని, కుటుంబసభ్యుల మధ్య గొడవలకు మధ్యవర్తులు అవసరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, అవన్నీ మరిచిపోయి తాను కొట్టిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ విషయంపై ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలని కోరిన మోహన్ బాబు ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా అన్ని ప్రశ్నించారు.
"మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి జరగొచ్చని ఆలోచించా. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా. నా ఇంట్లోకి దూసుకొచ్చేవాళ్లు జర్నలిస్టులా కాదా నాకు తెలియదు. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు బాధపడుతున్నాను. దెబ్బతగిలిన మీడియా ప్రతినిధి నాకు తమ్ముడులాంటివాడు. అతని భార్యాబిడ్డల గురించి ఆలోచించాను. నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. నేను కొట్టడం తప్పే, కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను చేసింది న్యాయమా, అన్యాయమా ప్రజలు ఆలోచించాలి" - మంచు మోహన్ బాబు ఆడియో
కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి మోహన్‌బాబు డిశ్చార్జ్
జల్పల్లిలో మళ్లీ ఘర్షణకు దిగిన మంచు బ్రదర్స్ - మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు