Mohan Babu lunch motion petition In HC : సీనియర్ నటుడు మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాచకొండ పోలీసుల నోటిసులపై స్టే ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో కోరారు. మోహన్‌బాబు పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణను ఈనెల 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపునిచ్చింది.
హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట : పోలీసులు మోహన్‌బాబుకు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. రెండు పరస్పర ఫిర్యాదులపై నమోదైన కేసులు కాకుండా మోహన్‌బాబుపై మరో కేసును నమోదు చేశామని పీపీ కోర్టుకు తెలిపారు. జర్నలిస్ట్‌లపై దాడి చేసిన కేసులో మోహన్‌బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశామని పీపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల నోటీసులు అందుకున్న మనోజ్ ఈరోజు విచారణకు హాజరయ్యారని పీపీ తెలిపారు.
పోలీసుల నోటీసులపై హైకోర్టు స్టే : మంచు మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నారని కోర్టుకు మోహన్‌బాబు తరఫు న్యాయవాది నగేశ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కుటుంబ విషయాలను మీడియాలో పెద్దదిగా చేసి చూపిస్తున్నారని న్యాయస్థానానికి వివరించారు. మోహన్‌బాబు అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. రక్షణ కల్పించాలని ఈ నెల 9న కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదని న్యాయవాది తెలిపారు.
మోహన్‌బాబు ఇంటివద్ద పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని న్యాయవాది నగేశ్ కోరగా అలా చేయడం సాధ్యం కాదని పీపీ తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఓసారి గస్తీ పోలీసులు మోహన్ బాబు ఇంటివద్దకు వెళ్లి వస్తున్నారని పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్ బాబుకు ఈనెల 24 వరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు ఇస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 24 వ తేదీకి వాయిదా వేసింది.
ఆసుపత్రిలో మోహన్ బాబు - జల్పల్లి ఘటనపై పోలీసు శాఖ సీరియస్
'మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు - ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు'