ETV Bharat / state

కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదు - కస్టడీ ఉత్తర్వుల్లో రౌజ్‌అవెన్యూ కోర్టు న్యాయమూర్తి - Delhi Liquor Scam Updates

MLC Kavitha Arrest Updates Latest : కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ స్పష్టంచేశారు. పీఎంఎల్‌ఏలోని సెక్షన్‌ 19ను ఈడీ పాటించిందని ఆయన తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

MLC Kavitha
MLC Kavitha
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 7:12 AM IST

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదు

MLC Kavitha Arrest Updates Latest : దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఈడీ పాటించలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha on ED Arrest) వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ కొట్టేశారు. ఆమె అరెస్ట్‌ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిబంధనల ప్రకారమే నడుచుకొందని స్పష్టంచేశారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. 16న కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటికి వచ్చింది.

Delhi Liquor Scam Updates : దిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ (Judge MK Nagpal on Kavitha) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దిల్లీ ఎక్సైజ్‌ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచి నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉండి తర్వాత అప్రూవర్‌లుగా మారిన పి. శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్‌, దినేశ్‌ అరోడా, ఇతర సహ నిందితులు సమీర్‌ మహేంద్రు, గోరంట్ల బుచ్చిబాబు, సాక్షి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వి.శ్రీనివాసరావు, గోపీ కుమరన్‌లు ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అద్దంపడుతున్నాయని న్యాయమూర్తి అన్నారు.

దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అరెస్టు

కవితతో సమావేశమైన తర్వాతే మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవ్‌లు ఆమె అనుచరుడైన గోరంట్ల బుచ్చిబాబుకు రెండు విడతల్లో రూ.25 కోట్లు ఇచ్చినట్లు రికార్డుల్లోకి వచ్చిందని న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తెలిపారు. ఈ మొత్తంలో సగం తాను చెల్లిస్తానని నిందితురాలు హామీ ఇచ్చారని ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఇచ్చిన ముడుపులను తిరిగి రాబట్టుకోవడానికి టోకు వ్యాపార సంస్థ ఇండోస్పిరిట్‌లో భాగస్వామిగా చేర్చిన అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై నిందితురాలి ప్రతినిధి లేదా బినామీనే అని న్యాయమూర్తి ఉత్తర్వులో వెల్లడించారు.

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఎమ్మెల్సీ కవిత కుట్రదారు - కస్టడీ పిటిషన్‌లో వెల్లడించిన ఈడీ

MLC Kavitha Arrest Updates : కొన్ని మొబైల్‌ ఫోన్లను ఫార్మాట్‌, ట్యాంపరింగ్‌ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయన్న న్యాయమూర్తి మనీ లాండరింగ్‌ నేరంలో భాగస్వామి కావడంతోపాటు, కీలకపాత్ర పోషించినట్లు రికార్డులు చెబుతున్నాయని వివరించారు. దర్యాప్తు అధికారి సమర్పించిన కేస్‌ ఫైల్‌ను పరిశీలిస్తే విచారణకు ఆమె హాజరు కాకపోవడం వల్ల దర్యాప్తు స్తంభించినట్లు కనిపిస్తోందన్న ఆయన నేరపూరిత ఆదాయంలోని ప్రధాన భాగాన్ని వెలికితీయడానికి కవితను విచారించాల్సిన అవసరం కనిపిస్తోందని తెలిపారు. పీఎంఎల్‌ఏ లోని సెక్షన్‌-19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయడమే కాకుండా అందుకు కారణాలను కవితకు లిఖితపూర్వకంగా ఇచ్చారని స్పష్టంచేశారు. ఇందులో చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కనిపించలేదని న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ వివరించారు.

MLC Kavitha Writ Petition in Supreme Court : మరోవైపు దిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత ఈ నెల 18న దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈమేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్‌ చేసింది.

ఆప్​ నేతలతో కలిసి కవిత దిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారు : ఈడీ​

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్​కు నిరసనగా బీఆర్​ఎస్​ శ్రేణుల ఆందోళన బాట - కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.