ETV Bharat / state

LIVE UPDATES : ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయం వద్ద సీఎం రేవంత్​ నివాళులు - ఎమ్మెల్యే లాస్య నందిత

MLA Lasya Nanditha Died in Road Accident on ORR : కంటోన్మెంట్ బీఆర్​ఎస్​​ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్​చెరు ఓఆర్​ఆర్​పై ఈ ప్రమాదం జరిగింది. నందిత మరణం పట్ల సీఎం రేవంత్​ రెడ్డి సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

MLA Lasya Nanditha Died
MLA Lasya Nanditha Died in Road Accident on ORR
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 9:37 AM IST

Updated : Feb 23, 2024, 5:27 PM IST

5.12 PM

లాస్య నందిత భౌతికకాయం వద్ద సీఎం నివాళులు

కార్ఖానాలోని నివాసంలో ఉన్న లాస్య నందిత భౌతికకాయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్​, పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్​బాబు ఉన్నారు. వారంతా లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లాస్య కుటుంబసభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు.

4.50PM

కాసేపట్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర

కాసేపట్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు లాస్య ఇంటికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ చేరుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగేలా సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మారేడ్‌పల్లి శ్మశానవాటికలో లాస్య నందిత అంత్యక్రియలు జరగనున్నాయి.

4.33 PM

కాసేపట్లో లాస్య నందిత భౌతికకాయానికి సీఎం నివాళులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి ఉదయం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత తండ్రి స్వర్గీయ సాయన్నకు తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గతేడాది ఇదే నెలలో ఆయన కన్నుమూయడం, ఈ సంవత్సరం లాస్య అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరికాసేపట్లో లాస్య నందిత భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు.

2.08 PM

లాస్య నందిత తలకు తీవ్రగాయాలు అయ్యాయి : గాంధీ వైద్యులు

లాస్య నందిత తలకి తీవ్రగాయాలు అయ్యాయని గాంధీ వైద్యులు తెలిపారు. ఆమె దవడ ఎముక విరిగిందన్నారు. నందిత ఎడమకాలు ఎముక, ఛాతి ఎముకలు విరిగాయని గాంధీ వైద్యులు వివరించారు.

1.35 PM

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్​ నివాళి

సికింద్రాబాద్​లోని లాస్య నందిత భౌతికకాయానికి బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు.

1.00 PM

అంత్యక్రియలు ఏర్పాటుపై హైదరాబాద్​ కలెక్టర్​కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్​లోని లాస్య నందిత భౌతికకాయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీశ్​రావు, సబితా ఇంద్రారెడ్డి, కేశవరావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు ఏర్పాట్లపై హైదరాబాద్​ కలెక్టర్​కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

12.45 PM

లాస్య నందిత మృతి పట్ల గవర్నర్​ తమిళిసై సంతాపం

లాస్యనందిత మృతిపట్ల గవర్నర్‌ తమిళిసై సంతాపం తెలిపారు.

12.00 PM

కార్ఖానాలో నివాసానికి చేరుకున్న లాస్య నందిత భౌతిక కాయం

కార్ఖానాలో నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం చేరుకుంది. లాస్యనందిత భౌతికకాయం వెంట హరీశ్‌రావు, తలసాని, పల్లా ఉన్నారు. లాస్య నందిత నివాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకున్నారు.

11.40 AM

అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు : మంత్రి కోమటిరెడ్డి

అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. లాస్య నందిత అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారన్నారు. లారీ ఢీకొట్టిన తర్వాత రెయిలింగ్​కు తగిదిందని ఏసీపీ చెప్పారన్నారు. సీట్​ బెల్ట్​ పెట్టుకోలేదని ఏసీపీ తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

11.08 AM

లాస్య నందిత కుటుంబ సభ్యులతో బాసర వెళ్లారు : లాస్య సోదరి వాణి

లాస్య నందిత కుటుంబ సభ్యులతో బాసర వెళ్లారని నందిత సోదరి వాణి తెలిపారు. రెండు కార్లలో బాసరకు కుటుంబ సభ్యులు వెళ్లారన్నారు. నందిత, డ్రైవర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగినట్లు వివరించారు.

10.53 AM

గాంధీ ఆసుపత్రికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి

ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి ఎమ్మెల్సీ కవిత చేరుకుని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

10.31 AM

కాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత భౌతికకాయం

కాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్యనందిత భౌతికకాయం చేరుకోనుంది. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయనున్నారు.

10.30AM

లాస్య నందిత మృతి పట్ల పలువురు సంతాపం

లాస్య నందిత మృతి పట్ల బీఆర్​ఎస్​, బీజేపీ, టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. నందిత మృతి పట్ల సీఎం రేవంత్​ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్​, చంద్రబాబు సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​బాబు, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సంతాపం వ్యక్తం చేశారు.

10.16 AM

గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి శవపరీక్షలు

గాంధీ ఆస్పత్రిలో లాస్య నందిత మృతదేహానికి శవపరీక్షలు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న బీఆర్​ఎస్​ నేతలు హరీశ్​రావు, తలసాని శ్రీనివాసయాదవ్​, పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ముఠా గోపాల్​. కాంగ్రెస్​ కార్పొరేటర్​ విజయారెడ్డి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.

9.59 AM

లాస్య నందిత మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన ఏడాదిలోపే కుమార్తె మృతి దురదృష్టకరమని ఆవేదన చెందారు. ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా విధి మరొకటి తలచిందని అన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

9.58 AM

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెల్లవారుజామునే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్​ నిద్రమత్తు, వేగం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెయిలింగ్​ను ఢీకొట్టిన కారు ముందు భాగం, ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి.

9.48 AM

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సంతాపం

లాస్య నందిత అకాల మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తీవ్ర విచారకరం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

లాస్య నందిత మృతదేహం గాంధీ ఆసుపత్రికి తరలింపు

లాస్య నందిత మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భౌతికకాయం వెంట గాంధీ ఆస్పత్రికి ఎమ్మెల్యే హరీశ్‌రావు వెళ్లారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్

రేవంత్‌రెడ్డి

  • నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: సీఎం రేవంత్‌రెడ్డి
  • నందిత కుటుంబసభ్యులకు సీఎం రేవంత్‌ ప్రగాఢ సానుభూతి
  • నందిత తండ్రి సాయన్నతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి: సీఎం
  • లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: సీఎం
  • గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి స్వర్గస్తులయ్యారు: సీఎం
  • ఈ ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరం: సీఎం

రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అకాల మరణం ఎంతో బాధాకరం : కేసీఆర్​

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీఆర్​ఎస్​ అధినేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు కేసీఆర్​ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అకాల మరణం ఎంతో బాధాకరమని అన్నారు. కష్టకాలంలో నందిత కుటుంబానికి బీఆర్​ఎస్​ అండగా ఉంటుందని చెప్పారు.

లాస్య నందిత మృతి బాధాకరం : కేటీఆర్‌

లాస్య నందిత మృతిపట్ల కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత వారమే ప్రమాదానికి గురైన లాస్య నందితను పరామర్శించానన్నారు. అంతలోనే నేడు మళ్లీ ప్రమాదానికి గురై మృతిచెందడం బాధాకరమైన విషయం అన్నారు.

లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలి : హరీశ్​రావు

లాస్య నందిత మృతి పట్ల హరీశ్‌రావు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నందిత మృతి చెందడం బాధాకరమైన విషయం అన్నారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆవేదన చెందారు.

07:13 AM

కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య(37) నందిత మృతి
  • కారు ప్రమాదంలో భారాస ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
  • పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురైన నందిత కారు
  • ఘటనాస్థలిలోనే మృతిచెందిన ఎమ్మెల్యే లాస్య నందిత
  • అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఎమ్మెల్యే నందిత కారు
  • ప్రమాదంలో నందిత పీఏ ఆకాష్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రిలో చికిత్స
  • కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అమీన్‌పూర్ పోలీసులు
  • దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత
  • గతేడాది లాస్య నందిత తండ్రి సాయన్న మృతి
  • ఏడాది వ్యవధిలోనే తండ్రి సాయన్న, కుమార్తె నందిత మృతి
  • ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నందిత
  • గతంలోనూ నార్కట్‌పల్లి వద్ద ప్రమాదానికి గురైన నందిత

Last Updated : Feb 23, 2024, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.