Mirchi Farmers Problems In Khammam : ఖమ్మం జిల్లాలో వాణిజ్య పంటల్లో మిరపది అగ్రస్థానం. వరి తర్వాత రైతులు మిరప, పత్తి సాగు వైపు మొగ్గు చూపుతారు. ఖమ్మం మార్కెట్‌లో గతేడాది మిరపకు భారీగా ధర పలికింది. కర్షకులంతా ఎర్రబంగారం సాగువైపు మళ్లారు. జిల్లాలో ఈ ఏడు ఏకంగా 92వేల ఎకరాల్లో సాగు చేశారు. నీటి ఎద్దడి ఉన్నా బావుల కింద సాగు చేశారు.
మెట్ట భూముల్లోనూ మిరప సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ ఏడాది మొదటి నుంచి మిరప సాగు చేసిన అన్నదాతలకు ఇబ్బందులు తప్పలేదు. తొలుత ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తి మొక్క ఎదగలేదు. తర్వాత వచ్చిన పెను తుపాను ధాటికి తోటలు దెబ్బతిని దిగుబడిపై ప్రభావం పడింది. కాయ పెరగకుండా సగానికి సగం తాలుగా మారింది. గతంలో ఎర్ర కాయలో తాలు ఏరే వారు ఇప్పుడు తాలుకాయలో ఎర్రకాయ ఏరాల్సిన పరిస్థితి వచ్చింది.
పూత దశలోనే మిర్చిపై వైరస్ కాటు.. నష్టపోతున్న రైతులు..
Khammam Mirchi Farmers : తీవ్ర తుపాను దాటికి ఎర్రకాయ రంగు మారి నష్టపోయిన రైతుకు చలికాలంలో ప్రబలిని నల్లి, తెల్లదోమ వంటి కీటకాలు పంటను పూర్తిగా నష్టపరిచాయి. నల్లి తెగులుతో పూత రాలి కాయపడే పరిస్థితి లేకుండా పోయింది. తెగుళ్లను అరికట్టేందుకు వేలకు వేలు వెచ్చించి మందులు పిచికారి చేశారు. పురుగు మందుల వ్యాపారులు ఏది చెబితే అది కొట్టడం వల్ల పెట్టబడులు తడిసి మోపెడయ్యాయి.
Cyclone Michaung Effect on Mirchi Crops : ప్రతికూల వాతావరణం, తెగుళ్ల బెడదతో ఎకరా మిరప సాగు వ్యయం రెట్టింపైంది. విత్తనాలు, రసాయన మందులు, కూలీల ఖర్చు రైతులకు భారంగా మారింది. పంటను కాపాడుకునేందుకు అందినకాడల్లా అప్పులు చేశారు. ఇంతా చేస్తే దిగుబడి సగానికి సగం పడిపోయింది. గతంలో ఎకరాకు 35 క్వింటాల్ పంట తీసిన కర్షకులు ఈ ఏడు 10 క్వింటాళ్లు సైతం పండించలేకపోయారు. తాలు, మచ్చ ఉందనే సాకుతో మార్కెట్లో దళారులు ధరలు తగ్గించేసి రైతు నోట్లో మట్టి కొట్టారు.
మిర్చి రైతులకు సవాల్ విసురుతున్నతెగుళ్లు.. తోటలు దున్నేస్తున్న వైనం
Farmers Removing Chilli Crops : పంట నాణ్యత లేదంటూ క్వింటాల్‌కు పదివేల నుంచి 15 వేల లోపే కొనుగోలు చేశారు. జెండా పాట మాత్రం 20 వేల రూపాయల ధర పలకగా అందులో సగం కూడా రాలేదని సాగుదారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మిరపను పీకేసి కొందరు రైతులు కూరగాయల సాగును మొదలుపెట్టారు. కనీసం వ్యవసాయాధికారులు తోటల వైపు కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిండా మునిగిన మిరప రైతును ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.