Minor Girl Rape Incident in NTR District : ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన విద్యార్థిని(15) స్థానిక వసతి గృహంలో ఉంటూ ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన తోట చందు (22) రెండు నెలలుగా ప్రేమించమని బాలిక వెంటపడుతున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు సహకరిస్తూ చందును ప్రేమించమని బాలికపై ఒత్తిడి చేయసాగారు.
భర్తకు మద్యం తాగించి- వివాహితపై సామూహిక అత్యాచారం - Woman Gang Raped
జ్వరంతో బాధ పడుతున్న బాలిక ఇంటి వద్ద నుంచి కళాశాలకు రాకపోకలు సాగిస్తుంది. ఈ నెల 10న ఆర్టీసీ బస్సులో వస్తుండగా చందు బాలికను బస్సులో నుంచి దించాడు. తన మిత్రులతో కలిసి బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఓ భవనంలోకి తీసుకెళ్లి బాలిక వద్దని వారిస్తున్నా అత్యాచారం చేశాడు. తిరిగి ముగ్గురు ఓ ప్రదేశానికి చేరుకుని, ఒక మైనర్‌ను దించి, మిగిలిన ఇద్దరు అదే బైక్‌పై బాలికను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మర్లపాడు, వేంసూరు వైపు తీసుకెళ్లారు.
ఫేస్బుక్లో పరిచయం- పెళ్లి పేరుతో అత్యాచారం
ఆగస్టు 10వ తేదీ సాయంత్రం వరకు తమ వెంట ఉంచుకుని గ్రామానికి సమీపంలోని కాలువ గట్టు వద్ద దించి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు తన తల్లికి చెప్పగా ఆమె పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని బాలిక ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ కె. గిరిబాబు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.