Minor Girl Committed Suicide Due To Love Harassed In Hyderabad : ప్రేమ పేరుతో యువకుడి వేధింపుల కారణంగా ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జనహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కుషాయిగూడలో నివాసం ఉంటున్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మొదటి అమ్మాయి వేరే జిల్లాలో తొమ్మిదో తరగతి వరకు చదివింది. చదువు మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటుంది.
అదే ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడు గత కొంతకాలంగా ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గత రాత్రి వేధింపులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమ్మాయి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం
"గురువారం బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వాళ్ల కుమార్తె తొమ్మిదో తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. ఆ అమ్మాయి వెంట శివ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వెంటపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమ్మాయి ఉరి వేసుకుని మరణించినట్లుగా వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఎస్సీ వర్గానికి చెందిన వారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం." - మహేశ్, కుషాయిగూడ ఏసీపీ
ఇటీవల ప్రేమ వేధింపుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే స్థానిక పోలీసులకు లేదా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రాడానికి ఇబ్బందిగా ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వేధింపులను ఎదుర్కొని పరిష్కరించుకోవాలి కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని వివరించారు.
పొలం కోసమని తండ్రి ఇచ్చిన డబ్బులతో బెట్టింగ్ - ఉన్నదంతా పోయి చివరకు!
ప్రేమికుల ఆత్మాహత్యాయత్నం - ప్రేయసి మృతి - ప్రియుడి పరిస్థితి విషమం - Lovers Suicide Attempt