Minister Uttam fires on BRS : కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిన ఘటనలో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam) స్పందించారు. బ్యారేజీలపై నిపుణుల బృందం క్షేత్రస్థాయి పర్యటన పూర్తయిందని, నివేదిక రూపొందించే పనిలో ఉన్నారన్నారు. విచారణ అంశాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ భరోసా సెంటర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినప్పుడు పట్టించుకోని నేతలు, ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తొంభై వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి భారీ నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ప్రాజెక్టుకే గుండెకాయ వంటి మేడిగడ్డ కుంగిదని, మిగతా బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులో జరిగిన నష్టంపై రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏ(NDSA)తో విచారణ జరిపిస్తున్నామని మంత్రి తెలిపారు.
Minister Uttam on NDSA Committee : ఎన్డీఎస్ఏ కమిటీకి, నీటిపారుదల అధికారులు పూర్తిగా సహకరించాలని ఆదేశించినట్లు మంత్రి ఉత్తమ్‌కమార్ రెడ్డి తెలిపారు. వారు అడిగిన పత్రాలన్ని సమర్పించాలని, నిజనిజాలను వారికి నివేదించాలని తెలిపినట్లు పేర్కొన్నారు. వారికి సహకరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు స్ఫష్టం చేశారు. ఇవాళ ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం జలసౌధలో సమావేశం నిర్వహించనట్లు తెలిపారు.
తాను ఇక్కడికి రావడం వల్ల సమావేశంకు హాజరుకాలేదన్నారు. నిపుణుల నివేదిక ఆధారంగా ప్రాజెక్టుకు మరమ్మతులు, చర్యలు ఉంటాయని స్ఫష్టం చేశారు. నాలుగునెలలోపు నివేదిక రాబోతున్నట్లు పేర్కొన్నారు. తనకు కొందరు పలుమార్లు ఫోన్లు చేస్తున్నారని, గృహజ్యోతి , మహాలక్ష్మీ పథకాలు నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే సుమారు 80 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.
ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఆధారంగానే మరమ్మతులతో పాటు చర్యలు : ఉత్తమ్
పథకాలు అందని వారు అధైర్య పడొద్దని, నిజమైన లబ్దిదారులందరికి పథకాలను వర్తింపజేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. మాదకద్రవ్యాలపై సరఫరా, డ్రగ్స్ డీలర్ల విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
"బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినప్పుడు పట్టించుకోని నేతలు, ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే విచారణ అంశాలను వెల్లడిస్తాము. గృహజ్యోతి , మహాలక్ష్మీ పథకాలు నిరంతర ప్రక్రియ. అర్హులందరికీ పథకాలను అందిస్తాము". - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి
మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదం : మంత్రి ఉత్తమ్
అన్నారం, సుందిళ్లకూ ముప్పు పొంచి ఉంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి