ETV Bharat / state

పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - నిధుల విడుదలకు సిద్ధమన్న మంత్రి తుమ్మల - crop damage in telangana - CROP DAMAGE IN TELANGANA

Crop Damage in Telangana : రాష్ట్రంలో తాజాగా కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటనష్టం వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే పేర్కొన్న 2200 ఎకరాలకు అదనంగా, నిన్న కురిసిన అకాల వర్షాలతో మరో 920 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే రైతులకు పరిహార నిధులు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని మంత్రి తుమ్మల ఉద్ఘాటించారు.

Crop Loss Assessment Details
Crop Damage in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 8:58 PM IST

Crop Loss Assessment Details : రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల నడ్డీ విరుస్తున్నాయి. మొన్నటివరకు తగినంత నీరు లేక పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతు, తాజాగా పండిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో నష్టపోతున్నాడు. ఈనేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం పంటనష్టంపై దృష్టి సారించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దెబ్బతిన్న పంట వివరాలను సేకరిస్తున్నారు.

ప్రకృతి కన్నెర్రకు పెట్టుబడి వర్షార్పణం - అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం - crop damage in telangana

తాజాగా కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటనష్టం వివరాల సేకరణలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు అధికారులు పంట నష్టం వివరాల సేకరణకు ఉపక్రమించారు. ఇప్పటికే పేర్కొన్న 2200 ఎకరాలకు అదనంగా, నిన్న కురిసిన అకాల వర్షాలకు ఇంకొక 920 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు మంత్రితో పేర్కొన్నారు.

రంగారెడ్డి, జనగామ, నిర్మల్ జిల్లాలలో కొత్తగా పంట నష్టం నమోదైనట్లు, అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానలకు పంట నష్ట పరిహారం విడుదల చేసేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం కోసంకు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. దానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, ఎన్నికల సంఘాన్ని మరొసారి సంప్రదించి నిధుల విడుదలకు అనుమతులు పొందేలా విజ్ఞప్తి చేయమని సూచించింది.

Minister Tummala review on Crop Damage : వాటితోపాటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని కూడా తొందరగా మదింపు చేసి, నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టానికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే రైతులకు పరిహార నిధులు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని ఉద్ఘాటించారు. అంతేకాకుండా వరి పంట కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాల పాటు అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇలాంటి అకాల వర్షాలు సంభవించే సందర్భంలో పంట నష్టం తగ్గించే విధంగా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కర్షకులకు సూచించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వానాకాలం ముందు సరఫరా చేసే పచ్చి రొట్ట విత్తనాల సేకరణ కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించుటకు అనుమతి ఇచ్చినందుకు గానూ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్రంలో పలు చోట్ల వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Telangana

అకాల వర్షాలతో అపార పంట నష్టం - ఆదుకోమంటూ రైతన్నల వేడుకోలు - CROP DAMAGE in Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.