Sridhar Babu on Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వేగంగా విచారణ జరుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar babu) పేర్కొన్నారు. అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ వ్యవహారంలోని నిందితులందరూ బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.
కాంగ్రెస్ వచ్చి, కరువు తెచ్చిందంటూ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ, కరువు పేరుతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిచే అవకాశం ఉందని, కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయనే, బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు.
తెలంగాణలో ఇకపై రైతు ఆత్మహత్యలు లేకుండా చూసుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు
Sridharbabu Fires on KTR : వర్షాభావ పరిస్థితులపై కేటీఆర్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో వర్షాలు పడకపోతే, ఇప్పుడు సాగునీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని, ప్రకృతి వైపరిత్యాలకు ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి పేర్కొన్నారు. ప్రజల డబ్బును ప్రజలకే ఖర్చు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
మిషన్ భగీరథ తప్పుడు పథకమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కంటే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరికి మంచినీటి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ వచ్చాక, అప్పటి వ్వవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మంచినీటి సరఫరా చేస్తామని రూ.45 వేల కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. రూ.45 వేల కోట్లు ఖర్చు పెట్టినా, నీరు ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచినీటి సదుపాయం కల్పిస్తామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ వచ్చి, కరవు తెచ్చిందంటూ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వర్షాలు పడలేదు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పడిపోయాయి. ప్రకృతి పరంగా చోటుచేసుకున్న దానికి ఎవరూ ఏమీ చేయలేరు. కానీ మాకు ఆ విజ్ఞత ఉంది. రాష్ట్రనీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాము". - శ్రీధర్ బాబు, మంత్రి
'జీవో 317, 46 సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించండి'
పాశమైలారంలో కాలుష్య వ్యర్థాల శుద్ధి కర్మాగారం ఏర్పాటు - మంత్రులతో కలిసి ప్రారంభించిన స్పీకర్