ETV Bharat / state

మూసీ ప్రక్షాళన - ప్రతిపక్ష పార్టీ విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్​ - Minister Sridhar Babu Fires On BRS - MINISTER SRIDHAR BABU FIRES ON BRS

Minister Sridhar Babu On Musi River Issue : మూసీ నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. పేదవాళ్లను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Minister Sridhar Babu On Musi River Front
Minister Sridhar Babu On Musi River Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 10:30 PM IST

Updated : Sep 29, 2024, 10:37 PM IST

Minister Sridhar Babu On Musi River Front : మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న శ్రీధర్ బాబు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు.

హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి : మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్​ను ఏర్పాటుచేసుకొని ముందుకు వెళ్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా కూల్చివేతలపై స్పందించారు. హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే చెరువులు, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. తెలిసో, తెలియకనో కొందరు మూసీలో ఇళ్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారని పేదలను నిలబెట్టాలన్నదే తమ ఉద్దేశ్యమని పడగొట్టాలని కాదని అన్నారు.

మూసీ నిర్వాసితులకు భరోసా : మూసీ రివర్ బెడ్​లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారని అన్నారు. మూసీ నిర్వాసితులకు పూర్తి భరోసా ఇస్తున్నామని వారికి డబుల్ బెడ్​ రూం ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. నిర్వాసితులందరికి న్యాయం చేస్తామని వారందరిని కాపాడే బాధ్యత తమదేనన్నారు. హైదరాబాద్​కు గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గోదావరి నీటిని మూసీ నదిలో ప్రవహింపజేస్తామన్నారు.

ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్ :​ మూసీపైన పీపీపీ మోడల్​లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్​ను తీర్చిదిద్దుతామని పలికారు. 35 టీమ్​లతో సోషియో ఎకానామిక్ సర్వే చేస్తున్నామని తెలిపిన మంత్రి, 12 ఎన్జీవో ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. తొమ్మిదేళ్లలో వ్యవస్థలు అన్ని నాశనం అయ్యాయని వాటిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. రాజకీయ కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

"ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుంది. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు."-శ్రీధర్ బాబు, ఐటీశాఖ మంత్రి

జీవనదిలా మూసీ - మంచినీటిని వదిలే ప్రాజెక్టు నిర్మాణం కోసం వారంలో టెండర్లు - Fresh Water Project

మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దు : మంత్రి పొన్నం ఫైర్ - Minister Ponnam Slams BRS

Last Updated : Sep 29, 2024, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.