Minister Seethakka Review on Floods : వర్షాకాలంలో ఏలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాలు, వరదల పరిస్థితిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, శాఖాపరమైన అధికారులు, జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
బీజేపీ హయాంలో ఉపాధి హామీచట్టం నిర్వీర్యం : మంత్రి సీతక్క - seethakka fires on bjp
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై మంత్రి సీతక్క అధికారులతో చర్చించారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు ఉన్నందున, ముందస్తుగా సమస్యలను గుర్తించి వాటిని పరిస్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కొత్త కనెక్షన్లు, పాత కనెక్షన్లపై సమీక్షించిన మంత్రి సీతక్క పాత గృహాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నీటిపంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. వర్షాల వల్ల పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటితో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు సూచించారు. హోటళ్లు, మార్కెట్లు, దుకాణాలలో నిల్వ ఉంచే వస్తువులపై నిఘా ఉంచాలని, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే వాటిని తాత్కాలికంగా నిషేధించాలని ఆమె స్పష్టం చేశారు.
కోళ్ల ఫారంల యాజమాన్యాలను పారిశుద్ధ్యపై అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాలలో నీటి నిల్వలను తొలగించుట, గుంతలు పూడ్చుట, నీటి నిల్వ ప్రాంతాలలో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లడం లాంటివి మొదలు పెట్టాలన్నారు. జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు, సంబంధిత మండల పంచాయతీ అధికారులు ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, త్రాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు.
ఆరోగ్యశాఖ సహకారంతో ఓఆర్ఎస్ ద్రావణ ప్యాకెట్లు అందేటట్లు, వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న మంత్రి సీతక్క, మహిళాశక్తి పథకం కింద పాఠశాల యూనిఫాం కుట్టడంపై దాదాపు పూర్తయిందని పాఠశాల ప్రారంభలోనే విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తామని తెలిపారు.
కుట్రలు జరగడం వల్లే ఆదిలాబాద్ ఎంపీ సీటు కోల్పోయాం : మంత్రి సీతక్క - Minister Seethakka about Defeat
పిల్లల దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : మంత్రి సీతక్క