Minister Ponnam Prabhakar On Samagra Kutumba Survey : రాజకీయ పార్టీల నాయకులందరూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని తెలిపారు.
రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారైన ఎన్యుమరెటరును పిలిచి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో రాజకీయాలు లేవు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులైనా వారంతా అప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో సమగ్ర కుటుంబ సర్వే - ఆయన ఏమన్నారంటే?
అందరూ సహకరించాలి : రాష్ట్రంలో సర్వే పూర్తయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదని వివరించారు. ఈ మేరకు మంత్రి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీసీలకు వ్యతిరేకంగా, ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండని సూచించారు.
"కుటుంబ సర్వేలో ఎవరైనా సమాచారం ఇవ్వలేని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు తమ వివరాలను మీ ప్రాంత సమాచారం సేకరణ అధికారి ఎన్యుమరేటర్‌కు పిలిచి మీ సమాచారాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ నాయకులు కూడా ఈ సర్వేకు సహకరించాలి." - పొన్నం ప్రభాకర్, మంత్రి
ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి : ప్రభుత్వం తీసుకున్న సర్వేలో రాజకీయనాయకులు లేకుండా ఉంటే మంచిది కాదు సమాచార శాఖలో అందరూ భాగస్వాములై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. ఎవరైనా రాకపోతే పోస్టులు పెట్టి విమర్శించడం కాదని హితవు పలికారు. సమాచార లోపం, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యతగల వారిగా ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. 'అందరూ సమాచారం ఇవ్వండి ఈ సర్వేలో పాల్గొనాలని' మంత్రి పొన్నం సూచించారు.
సమస్తం ఆన్లైన్లో నిక్షిప్తం : తుది దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వే
'కొందరి ఆచూకీ, చిరునామా తెలియడం లేదు - వారి వివరాలు చెబుతారా ప్లీజ్'