ETV Bharat / state

హైదరాబాద్​కు భారీ వర్ష సూచన - అప్రమత్తమైన అధికారులు - Rain Alert in Hyderabad Today

Heavy Rain Alert in Hyderabad : నేడు హైదరాబాద్​కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, జలమండలి, డీఆర్​ఎఫ్​ బృందాలు, ఇతర విభాగాల అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్​ అప్రమత్తం చేశారు.

Heavy Rain Alert in Hyderabad
Heavy Rain Alert in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 2:08 PM IST

Updated : Jul 16, 2024, 2:54 PM IST

Heavy Rain Forecast for Hyderabad City Today : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. నేడు ఆదిలాబాద్​, కొమురం భీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం దక్షిణ ఒడిశా తీరం వద్ద వాయువ్య దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు దక్షిణ ఛత్తీస్​ఘర్​​ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైనదని తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని చెప్పింది.

ఋతుపవన ద్రోణి నేడు జైసాల్మయిర్, కోట ఛత్తీస్​ఘర్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం గుండా వెళుతూ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని చెప్పింది. గాలి విచ్చిన్నతి ఈరోజు 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 7.6 కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. మరి ఒక అల్పపీడన ప్రాంతం జులై 19 తేదీన పశ్చిమ-మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మంత్రి పొన్నం హెచ్చరిక : ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, జలమండలి, డీఆర్​ఎఫ్​ బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్​లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్​లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్లు నిల్వ ఉండే 141 ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ సిబ్బంది ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాలు వారిని అప్రమత్తం చేయాలన్నారు. పాత భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలన్నారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గట్టిగా హెచ్చరించారు. స్తంభాల వద్ద పరిస్థితి విద్యుత్​ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పోలీసు, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, వివివధ విభాగాల అధికారులు ప్రజలు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

హైదరాబాద్​లో ఏకధాటిగా కురిసిన వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Rains in Hyderabad

Last Updated : Jul 16, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.