Minister Ponnam Participate in Half Marathon Run : మెట్రో పాలిటన్ సిటీలలో జరిగే హాఫ్ మారథాన్ పరుగు పోటీలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంగా నిర్వహించడం పట్ల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister) హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో 4 వ ఎడిషన్ హాఫ్ మారథాన్ పరుగు పోటీల్లో పాల్గొన్న మంత్రి, జెండా ఊపి పరుగు పోటీలను ప్రారంభించారు.
మూడు విభాగాల్లో మొదలైన మారథాన్లోని 5 కే పరుగు పోటీలో మంత్రి కూడా పాల్గొని పరుగు పోటీదారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. రేసు పూర్తి చేసిన అంధుడిని, వృద్ధుడిని మంత్రి పొన్నం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలుగా హుస్నాబాద్‌లో హాఫ్ మారథాన్ పోటీలను నిర్వహిస్తున్న రన్నర్స్ అసోసియేషన్, పోలీస్ శాఖను అభినందించారు.
అయోధ్యకు 1430కి.మీ రన్- సనాతన ధర్మంపై అవగాహనే లక్ష్యం!
భవిష్యత్తులో 5 వ ఎడిషన్ హాఫ్ మారథాన్ పరుగు పోటీలను(Running Competitions) హుస్నాబాద్‌లో ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. 5 వ ఎడిషన్‌లో హుస్నాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల యువకులు, ఔత్సాహికులు పాల్గొనేలా పెద్ద ఎత్తున ముందస్తు కార్యక్రమాలు చేసుకుందామన్నారు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాలన్నారు.
"మెట్రో పాలిటన్ నగరాల్లో మాత్రమే జరిగే ఈ మారథాన్ పోటీలు, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరికీ నా అభినందనలు. భవిష్యత్‌లో కొనసాగించడమే కాకుండా, తదుపరి ఎడిషన్ హాఫ్ మారథాన్ పోటీలకు పెద్ద ఎత్తున ముందస్తు కార్యక్రమాలు చేసుకుందాం. దీనికోసం నిర్వాహకులు ఎవరిదగ్గరకు గానీ, ఎక్కడకీ వెళ్లకుండా పూర్తి బాధ్యతను మేమే నిర్వహిస్తాం."-పొన్నం ప్రభాకర్, మంత్రి
Minister Ponnam congratulate to Blind Person : మరోవైపు మారథాన్ పరుగు పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన అంధుడు లక్ష్మీనారాయణ 21 కే పరుగు పోటీ పూర్తి చేసి, అందరినీ అబ్బుర పరిచాడు. చూపు లేకున్నా లక్ష్మీనారాయణ సహాయకుడితో 21 కే పరుగు పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష్మీనారాయణ ఎందరికో ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
అన్ని విధాలుగా బాగున్నవారు చేయలేనిది, అంధుడు లక్ష్మీనారాయణ చేసి చూపించినందుకు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఇదివరకు కూడా పలు హాఫ్ మారథాన్ పరుగు పోటీల్లో పాల్గొని విజయవంతంగా పరుగు పూర్తి చేసినట్లు లక్ష్మీనారాయణ(Blind Person) తెలిపారు. తనకు ఇదే విధంగా అందరూ సహకరించాలని కోరారు.
రామోజీ గ్రూప్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి