Minister Ponnam Chit Chat : రాష్ట్రంలో వీఐపీల వద్ద పనిచేసే డ్రైవర్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన డైవర్లకు డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలని రవాణాశాఖే సుమోటోగా తీసుకుని చేస్తుందన్నారు. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ ఆపరేషనల్ లాభాల్లోకి వస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. మహాలక్ష్మి పథకం వ్యయాన్ని ప్రభుత్వం రీఫండ్ చేయడం, వృథా ఖర్చులు తగ్గించడం, ఆక్యుపెన్షి రేషియోను పెరగడం వల్లనే ఆపరేషనల్ లాభాల్లోకి ఆర్టీసీ వచ్చినట్లు వివరించారు. గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి(Minister Ponnam), సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని వీఐపీల డ్రైవర్ల అందరికి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి
Minister Ponnam Prabhakar : సూమోటోగా తీసుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్‌గా 44లక్షల ప్రయాణాలు ఉంటే ఇప్పుడు 55 లక్షలకు పైగా ప్రయాణాలు ఉన్నాయని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణా శాఖ ఎక్కడక్కడ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ప్రతిభ లేని డ్రైవర్లను ఎవరిని కూడా విధుల్లో ఉంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు సాయం పథకంపై కసరత్తు చేస్తున్నారన్నారు. మహాలక్ష్మీ పథకంలో కండక్టర్లు అనవసరంగా టికెట్లు జారీ చేసినట్లు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గురుకుల నియామకాల్లో సరైన విధానం పాటించాలి - సీఎం రేవంత్‌రెడ్డికి ప్రవీణ్‌కుమార్ లేఖ
బీసీ కులగణన ప్రారంభిస్తాం : హైదరాబాద్ నగరంలో కొత్తగా ఆటోలకు అనుమతులు ఇవ్వడం లేదన్న ఆయన కొత్త వాటికి అనుమతించడం వల్ల ఉన్న వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బీసీ కులగణనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్న మంత్రి బిహార్‌లో రెండున్నర లక్షల మందికి సర్వే బాధ్యత అప్పగించారని ఒక్కొక్కరికి 150 ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. అదే తరహాలో ఇక్కడ కూడా ప్రవేశ పెట్టే విషయమై పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. బిహార్‌లో కూడా కులగణన కోసం అసెంబ్లీలో చట్టం తీసుకురాలేదని స్పష్టం చేసిన పొన్నం ప్రభాకర్ తెలంగాణాలో కూడా కులగణన పకద్బందీగా నిర్వహిస్తామన్నారు. తాము అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నామన్న పొన్నం బయట విషయాలను తరువాత పట్టించుకుందామని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో క్రమంగా కొత్త బస్సులు కూడా తెప్పిస్తున్నట్లు చెప్పారు.
ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నేడు కీలక సమావేశం - ఆ కమిటీతో సీఎం రేవంత్ భేటీ
మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదు : సీఎం రేవంత్‌రెడ్డి