Minister Konda Surekha Fires On KTR : కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు పెట్టారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.
కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పినట్లు ఉన్నారన్నారు. అకౌంట్ నాది కాదు అన్నప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాలి కదా అని ప్రశ్నించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించవలసిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొండా సురేఖ 'అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళ ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు.
నాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు : మహిళలు, చిన్న పిల్లలు బయటకు వెళితే సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై దారుణాలకు పాల్పడుతున్నారని దీనివల్ల అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయన్నారు. ఎస్టీ మహిళ సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఇప్పుడు బీసీ మహిళనైన తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరం అన్నారు.
బీఆర్ఎస్లో తాను ఐదేళ్లు పని చేశానని తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లెలు లేరా? అని ప్రశ్నించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి తప్పితే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని హెచ్చరించారు.
"సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్, ఆయన మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డారు. హీరోయిన్లకు కూడా మత్తు పదార్ధాలు అలవాటు చేశారు. దీంతో హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. సినిమా పరిశ్రమలో ఈ విషయం బహిరంగ రహస్యం. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను కేటీఆర్ ఎందుకు ఖండించలేదు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పినట్లు ఉన్నారు. సైబర్ క్రైమ్‌లో పిర్యాదు చేశాం పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెడతాము." -కొండా సురేఖ, మంత్రి