ETV Bharat / state

కవితను అరెస్టు చేసింది ఈడీ - కావాలంటే దిల్లీలో ధర్నాలు చేసుకోండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komatireddy On BRS Kavitha Arrest Strikes in Telangana : దిల్లీ లిక్కర్​ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం ఉందని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు రాష్ట్రంలో ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

BRS Kavitha Arrest Strikes
Minister Komatireddy On BRS Kavitha Arrest Strikes in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 1:20 PM IST

Updated : Mar 16, 2024, 7:58 PM IST

Minister Komatireddy On BRS Kavitha Arrest Strikes in Telangana : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు నిరసనగా బీఆర్​ఎస్​ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. దిల్లీ లిక్కర్​ కేసుకు, రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. కవితను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారని, కావాలంటే అక్కడ ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు చేసుకోమని తెలిపారు. ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ధర్నా చేస్తే అడ్డుకున్నారని, ఇప్పుడు వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ - పలువురు నేతల రియాక్షన్

"ఏపీ అంశాలపై హైదరాబాద్‌లో ధర్నా ఎందుకన్నారు. ఇప్పుడు ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నా ఎందుకు? దిల్లీలోని ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు చేసుకోండి. ఎవడొస్తాడో రా చూసుకుందాం అని అన్నారు. కవిత అరెస్ట్ తరువాత ఇప్పుడేమో అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి

KTR On CBN Arrest Strikes in Hyderabad : గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వల్ల హైదరాబాద్​ ఆందోళనలు జరగడంపై మాజీ మంత్రి కేటీఆర్​ (Komatireddy Counter TO KTR) వ్యాఖ్యలు చేశారు. అది ఏపీ రాజకీయ సమస్య అని, దానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దీనికి మంత్రి కోమటి రెడ్డి ఇప్పుడు కౌంటర్​ వేశారని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే దిల్లీ పోలీసులు అరెస్టు చేస్తే అక్కడే ధర్నాలు చేసుకోవాలని సూచించారని వారు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

Minister Komati Reddy Reaction On MLC Kavitha Arrest : శుక్రవారం ఎమ్మెల్సీ కవిత అరెస్టుపైనా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్​ ముందు రోజు ఈడీ, ఐటీ దాడులు పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు గల్లీలో కొట్టుకుంటారు, దిల్లీలో దోస్తీ కడతారని విమర్శించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం : హరీశ్‌రావు

Last Updated : Mar 16, 2024, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.