ETV Bharat / state

ఒకే రోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం - ఏపీ పర్యాటక శాఖ ప్యాకేజి వివరాలివే

రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌

TOURISM MINISTER KANDULA DURGESH
minister kandula durgesh started the spiritual bus yatra in rajamahendravaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

Rajamahendravaram news Today: కార్తిక మాసం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. భక్తులు ఒకే రోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించింది.

రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక బస్సుయాత్రను ప్రారంభించిన మంత్రి దుర్గేశ్​: రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్‌లో ఈ బస్సుయాత్రను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అక్టోబరు 26న ప్రారంభించిన ఈ బస్సు ప్రతీ శనివారం ఉదయం 6 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 7.30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరం చేరుకోవడంతో ఈ యాత్ర ముగియనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా వారి కోసం ఆదివారం కూడా అధ్యాత్మిక యాత్రను కొనసాగించే ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.

సందర్శించే పుణ్యక్షేత్రాల వివరాలు: ఈ బస్సు యాత్రలో కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ తరువాత అక్కడి నుంచి అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాల సందర్శన ఉంటుంది. ఇక చివరిగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో గోదావరి హారతితో బస్సు యాత్ర ముగియనుంది. ప్రతీ శనివారం ఈ యాత్ర ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బస్సు టికెట్ల వివరాలు: ఈ బస్సులో పెద్దలకు 1000, 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు రూ. 800 చార్జి నిర్ణయించారు.

2027 పుష్కరాల నాటికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం : మంత్రి దుర్గేష్ - Durgesh Focus Godavari Pushkaralu

తిరుమలలో ఏపీటీడీసీ హోటళ్లను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్‌ - Kandula Durgesh Inaugurated Hotels

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.