Millets Food on Wheels : ఫుడ్ ఆన్ వీల్స్ వాహనాలు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందాయి. దేశవ్యాప్తంగా అదే ఒరవడి కొనసాగుతోంది. ఎంతోమంది ఆ వ్యాపారంవైపు అడుగులేస్తూ విజయం సాధిస్తున్నారు. అలాంటి ప్రయత్నాన్నే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులకు తగ్గట్టుగా ప్రజలకు నాణ్యమైన చిరుధాన్యాల ఉత్పత్తులను అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఏన్షియంట్ ఫుడ్స్ ఆధ్వర్యంలో "ఆన్ వీల్స్ హెల్తీ స్టోర్"ను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ ప్రారంభించారు.
చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం
దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత, ప్రాసెసింగ్ ఎగుమతుల పెంపే లక్ష్యమని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అహ్మద్ కిద్వాయ్ తెలిపారు. పర్యావరణహితం, ప్రజారోగ్యం దృష్ట్యా భవిష్యత్తులో తప్పనిసరిగా చిరుధాన్యాల సాగు, మార్కెటింగ్‌పై మొగ్గు చూపాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ జనరల‌్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ కోరారు.
"20 సంవత్సరాల క్రితం చక్కెర వ్యాధి కానీ, క్యాన్సర్ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ వందలో ఒక్కరికి మాత్రమే వినేవాళ్లం. ఇప్పుడు వందలో ఒక్కరికే లేకుండా పోతున్నాయి. ప్రతి ప్రాడక్ట్ ప్రిసర్వేటీవ్స్ లేకుండా ఆరోగ్యకరంగా కడిగి ఆరపెట్టి చేసి అందిస్తున్నాము. అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. ఎలాంటి ప్రిజర్వేటీవ్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు." - లక్ష్మీహరితా భవాని, వ్యవస్థాపకులు, ఏన్షియంట్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్
చిరుధాన్యాలతోనే మన ఆరోగ్యం సంరక్షించబడుతుంది : డా.ఖాదర్‌వలీ
Millets Food Store on Wheels : ఆన్ వీల్స్ హెల్తీ స్టోర్‌లో నాణ్యతతో కూడిన రాగి రవ్వ, పిండి, దోశ మిక్స్, బూందీ, జొన్నపిండి, మురుకులు, కొర్ర అరిసెలు, ఇతర ఉత్పత్తులు లభ్యమవుతాయి. పిజ్జా, బర్గర్ వంటి జంక్‌ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా వృద్ధులు, చిన్నారులు, ప్రత్యేకించి మహిళల కోసం ఆరోగ్యకర చిరుధాన్యాలు ఉత్పత్తులు భారీగా ప్రోత్సహిస్తామని సంస్థ ఫౌండర్ ఉమెన్ విజన్ కౌన్సిల్ ప్రవీణా నాయుడు తెలిపారు. చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్ కుడా లభిస్తాయని వారు చెప్పారు.
చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు - మిల్లెట్స్‌తో రుచికరమైన భోజనం
అందరు దీన్ని పెట్టేలా ఉండాలని రూ.5 లక్షల పెట్టుబడితో ఈ "ఆన్ వీల్స్ హెల్తీ స్టోర్" అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏన్షియంట్ ఫుడ్ ఇండియా లిమిటెట్ వ్యవస్థాపకురాలు లక్ష్మీహరిత భవాని తెలిపారు. ఆ మొబైల్ స్టోర్ హైదరాబాద్‌లో ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలో పని చేస్తుందని తెలిపారు. ఉరుకుల పరుగుల జీవితాల్లో జీవనశైలి వ్యాధులు దూరం చేసేలా పంచదార, మైదా, ప్రిసర్వేటివ్స్ ఉపయోగించకుండా చిరుధాన్యాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నట్లు లక్ష్మీహరితా భవాని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీ మోడల్ కావాలనుకునే ఔత్సాహిక మహిళలు ఎవరైనా ముందుకొస్తే, అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భారత్‌లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్, ఐఐఎంఆర్