Mid Manair project Expatriates story : రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ,తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు(Expatriates) పునరావాస కాలనీలకు(rehabilitation center) తరలివెళ్లారు.
Expatriates On Government : 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకు చేరగా పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 6.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు తరలివస్తున్న నిర్వాసితులు ఆనాడు తాము గ్రామాలు(villages) ఖాళీ చేయాలని ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకోలేదని వాపోతున్నారు.
Decreasing Water Levals in Water Bodies : వర్షాభావ పరిస్థితులు వేసవి తీవ్రత కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రంలో జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహాలు పెద్దగా లేవు. గోదావరి పరీవాహకంలో శ్రీరాంసాగర్, దిగువ మానేరులకు స్వల్పంగా వస్తుండగా మిగతా ఏ ప్రాజెక్టుకూ పైనుంచి చుక్కనీరూ రావడం లేదు. పైపెచ్చు ఉన్న జలాలు వినియోగం అవుతుండటం, ఎండల కారణంగా నీరు ఆవిరవుతుండటంతో నీటిమట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి((Decreasing Water Levals)
నీటి ఎద్దడికి చర్యలు చేపట్టిన అధికారులు : ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇన్‌టేక్ వెల్స్ వరకు కాలువలను లోతుగా తవ్వగా మరింత అడుగంటే పక్షంలో నది నుంచే నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు కసరత్తు ఆరంభించారు. ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో సమస్య తలెత్తకుండా పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తోడేందుకు వీలుగా అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో 2016లోనూ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరిలోకి ప్రత్యేక విద్యుత్ లైన్లు, రోడ్లు నిర్మించి నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ఇన్‌టేక్ వెల్ వద్ద 140 మీటర్ల మట్టం వద్ద నీళ్లు ఉన్నాయి. నీటి మట్టం పడిపోతే నది మధ్యలోంచి ఎత్తిపోసేందుకు అధికారులు(Officials) ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా నదిలోకి కిలోమీటరున్నర దూరం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు.
మిడ్ మానేరు నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
సాగునీటి కోసం రైతులకు తప్పని ఇబ్బందులు : జులై చివరి వారం నాటికి ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వస్తుందని అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్లంపల్లిలో నీటిస్థాయి పడిపోవడంతో సాగునీటికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు(People) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు కాల్వల్లో నీరు ఆవిరైపోవడం జలాశయాల్లో నీరు అడుగుతుండటంతో ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు వేడికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
మిడ్ మానేరు నిర్వాసితుల్లో చిగురిస్తున్న ఆశలు - కుటీర, ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళికలు