ETV Bharat / state

శ్రీవారి సుప్రభాత సేవలో మెగాస్టార్​ చిరంజీవి - స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఆనం - Celebrities Visited Tirumala - CELEBRITIES VISITED TIRUMALA

Celebrities Visited Tirumala: తిరుమల శ్రీవారిని మెగాస్టార్​ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

tirumala_visit
tirumala_visit (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 10:49 AM IST

Megastar Chiranjeevi Visits Tirumala : తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని సినీనటుడు మెగాస్టార్​ చిరంజీవి దర్శించుకున్నారు. 69వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజన దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తమ అభిమాన నటుడైన మెగాస్టార్​ చిరంజీవిని చూసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. చిరంజీవితో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.

తిరుమలలో గణనీయమైన మార్పులు - ఇకపై నాణ్యత లోపించిన ఆహారానికి స్వస్తి - TTD steps to provide quality food

MLA Nandamuri Balakrishna Wife Vasundhara Visit Tirumala : తిరుమల శ్రీవారిని సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. ఇవాళ వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ (TTD) ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

గత ప్రభుత్వ తప్పులు మళ్లీ జరక్కుండా తిరుమల పవిత్రతను కాపాడాలి-తెలంగాణ ఎంపీ లక్ష్మణ్

Minister Anam Ramanarayana Reddy Visit Tirumala : తిరుమల శ్రీవారిని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. వేకువ జామున సుప్రభాత సేవలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​కు శ్రీవారి ఆశీస్సులు ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

సర్వదర్శనానికి 12 గంటలు : శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 74,957 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,066 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చింది.

శ్రీవారి సుప్రభాత సేవలో మహేశ్​ బాబు ఫ్యామిలీ - స్వామివారిని దర్శించుకున్న వరుణ్​ తేజ్​ దంపతులు - Mahesh Babu Family in Tirumala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.