CM Revanth Meet on Cabinet Expansion : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికతో ఉత్పన్నమైన వివాదం, తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన నివాసంలో పార్టీ రాష్ట్ర పెద్లలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీలు తదితరులు పాల్గొన్నారు.
మనసు మార్చుకున్న జీవన్‌రెడ్డి - పార్టీనే ముఖ్యమని వ్యాఖ్య - MLC Jeevan Reddy Resign Issue
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించేందుకు భేటీ అయిన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీలు ధిల్లీలోనే ఉండడంతో ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్కకి దిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. దీంతో మణుగూరు నుంచి నేరుగా దిల్లీకి బయల్దేరారు.
ఈ సమావేశంలో ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, చేరికలు, నామినేటెడ్ పోస్టులకు నాయకుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి విషయంలో ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో, రాష్ట్రానికి చెందిన సీఎంతో పాటు సీనియర్ నాయకులతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకునే అలోచనలో ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అదేవిధంగా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి కూడా లోతైన చర్చ జరిగడంతో పాటు సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్లతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా బీఆర్‌ఎస్, బీజేపీల రాజకీయ పరిస్థితులపై కూడా కేసీ వేణుగోపాల్ చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి శాంతించిన విషయం తెలిసిందే.
తనకు సమాచారం అందించకుండా జగిత్యాల బీఆరఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన అలకబూనారు. తాను రాజీనామాకు సిద్ధమని, పదేళ్ల ప్రత్యర్థిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంపై మనస్థాపం చెందారు. ఈ వ్యవహారం దిల్లీ వరకు వెళ్లింది. పార్టీ పెద్దల బుజ్డగింపుతో ఆయన మెత్తబడ్డారు.